- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..!
నర్సంపేట ఆర్టీసీ డిపోలో గత రెండు రోజులుగా సమ్మె చేస్తున్న క్రమంలో కోల శంకర్ అనే డ్రైవర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసిన విషయం తెలిసిందే.

దిశ, నర్సంపేట : నర్సంపేట ఆర్టీసీ డిపోలో గత రెండు రోజులుగా సమ్మె చేస్తున్న క్రమంలో కోల శంకర్ అనే డ్రైవర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసిన విషయం తెలిసిందే. స్పందించిన తోటి ఉద్యోగులు అతన్ని మొదట నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్యం విషమంగా ఉండటంతో వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వరంగల్ జిల్లా ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడికి కవరేజ్ కోసం వెళ్లిన మీడియాను పోలీసులు, సిబ్బంది నిలువరించారు. మీడియా కి అనుమతి ఇవ్వలేదు. ఎంజీఎం ఆస్పత్రికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎవరినీ లోపలికి వెళ్లనివ్వడం లేదు. ప్రజాప్రతినిధులకు సైతం అనుమతి ఇవ్వడం లేదు. బీఎస్పీ నాయకుల ఫోన్లు తీసుకుని గేటు మూసివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎమర్జెన్సీ ద్వారం సైతం మూసేయడంతో మిగతా పేషెంట్లకు వైద్యం అందటంలో అంతరాయం కలుగుతున్నట్లు తెలుస్తోంది.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దయాకర్ పరామర్శ
నర్సంపేట పట్టణానికి చెందిన కోల శంకర్ గౌడ్ ఆత్మహత్యా యత్నం చేసుకున్నారన్న సమాచారం తెలుసుకున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి దయాకర్ ఎంజీఎం కు చేరుకున్నారు. శంకర్ ను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ హామీని తుంగలో తొక్కినట్లుఆరోపించారు. రెండున్నర ఏండ్లుగా హామీని విస్మరించి కార్మికుల పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహా లక్ష్మీ పథకంతో మహిళల ఓట్లు కొల్లగొట్టి ఆర్టీసీలో పని చేస్తున్న మహిళా కండక్టర్లను నిలువునా మోసం చేసినట్లు దుయ్యబట్టారు. తక్షణమే ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.






