- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Telangana Elections 2023: మొరాయించిన ఈవీఎంలు.. నిలిచిపోయిన పోలింగ్

X
దిశ, బయ్యారం: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. అయితే, కొన్ని ప్రాంతాలలో ఈవీఎంలు మొరాయిస్తున్న ఘటనలు వెలుగుచూశాయి. ఇల్లందు నియోజక వర్గంలోని బయ్యారం మండలంలో 43 పోలింగ్ బూతులు ఉండగా.. నారాయనపురం పంచాయితీ పరిధీలో 6వ నెంబరు పోలింగ్ బూతులో ఈవీఎం మొరాయించడంతో ఓటు వేసేందుకు వచ్చిన స్థానికులు అంతరాయం ఏర్పడటంతో వారు బూతుల వద్ద పడిగాపులు కాస్తున్నట్లు అక్కడి ఓటర్లు తెలిపారు. అదేవిదంగా బయ్యారం మండలంలోని పోలింగ్ బూతు 33 లో ఈవీఎం కొంత సేపు మొరాయించడంతో అక్కడే ఉన్న టెక్నీషన్ రీపేర్ చేయడంతో అక్కడ కొంత సేపు ఓటర్లకు అంతరాయం కలిగించింది. దీనిపై మండల అసిష్టెంట్ ఎన్నికల అధికారి ఇమ్మనియల్‌ను వివరణ కోరగా నారాయణ పురం ఈవీఎం మోరాయించిన విషయం ఇప్పుడే తెలిసిందని అని దానిని బాగు చేసేందుకు టెక్నీషన్ భగవాన్ రెడ్డిని పంపిస్తున్నట్లు తెలిపారు.
Next Story






