- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోటగడ్డలో కాకతీయుల నాటి ఆలయంలో శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు
by Ratna Kumari |
మండలంలోని కోటగడ్డ గ్రామంలో కొలువైన కాకతీయుల నాటి శ్రీ కంఠమహేశ్వరాలయంలోని గర్భగుడిలోకీ సూర్య కిరణాలు బుధవారం శివలింగాన్ని తాకినట్టు ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ నిర్వాహకులు బిక్షం తెలిపారు.

X
దిశ, బయ్యారం : మండలంలోని కోటగడ్డ గ్రామంలో కొలువైన కాకతీయుల నాటి శ్రీ కంఠమహేశ్వరాలయంలోని గర్భగుడిలోకీ సూర్య కిరణాలు బుధవారం శివలింగాన్ని తాకినట్టు ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ నిర్వాహకులు బిక్షం తెలిపారు. సూర్య కిరాణాలు శివ లింగానికి అభిషేకం చేసినట్టుగా కనువిందు చేశాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన గ్రామస్థులు చంద్రగ్రహణం ఏర్పడిన మరుసటి రోజే ఇలా జరగడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. ఈ విశేషాన్ని పురస్కరించుకొని ఆలయంలో భక్తులు శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ తంతు భక్తులు సెల్ ఫోన్ లలో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ గా మారాయి.
Next Story






