విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధి సాధించాలి

by Ratna Kumari |

విద్యార్థులు చదువుతో పాటు కళలు, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ రాణించి సర్వతోముఖాభివృద్ధి సాధించాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అన్నారు.

విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధి సాధించాలి
X

దిశ‌, హ‌నుమ‌కొండ క‌లెక్ట‌రేట్ : విద్యార్థులు చదువుతో పాటు కళలు, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ రాణించి సర్వతోముఖాభివృద్ధి సాధించాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అన్నారు. శనివారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రైమరీ పాఠశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో “ఆర్ట్, క్రాఫ్ట్, కల్చరల్ డే” వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు స్వయంగా తయారు చేసిన ఆర్ట్, క్రాఫ్ట్ వస్తువులతో ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాల్స్‌ను, చిత్రలేఖనాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారు రూపొందించిన కళాఖండాల ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు మన సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ప్రతిబింబించేలా అద్భుతమైన నృత్య ప్రదర్శనలు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రూపొందించిన ఆర్ట్, క్రాఫ్ట్ వస్తువులు ఎంతో సృజనాత్మకంగా ఉన్నాయని ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో సమానంగా ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజు గౌడ్, ఎడ్యుకేషన్ ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేష్, ఏఎంఓ డాక్టర్ మన్మోహన్, జీసీఈఓ సునీత, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story