- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమతులు లేకుండా ఆసుపత్రులు నడిపితే కఠిన చర్యలు
కాటారం మండల కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను డిఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అనుమతులు లేకుండా ఆసుపత్రులు నడిపితే కఠిన చర్యలు
: డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్
దిశ, కాటారం: కాటారం మండల కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను డిఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాయి హాస్పిటల్, శ్రీ బాలాజీ హాస్పిటల్, అరవింద ప్రధమ చికిత్స కేంద్రం, లలిత క్లినిక్‌లలో రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడైనా అనుమతులు లేకుండా ఆసుపత్రులు నడపకూడదని స్పష్టం చేశారు. ఆర్ఎంపీ వైద్యులు ఆసుపత్రుల పేరుతో వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకూడదని హెచ్చరించారు. అన్ని ఆసుపత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని, క్వాలిఫైడ్ డాక్టర్లు మాత్రమే చికిత్స అందించాలని సూచించారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుని ఆసుపత్రులను సీజ్ చేయడం తప్పదని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీదేవి, ఎంఓ కాటారం డాక్టర్ మౌనిక, పిఒ డాక్టర్ సందీప్, డెమో శ్రీదేవి, డిడిఎం మధు తదితరులు పాల్గొన్నారు.






