- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భక్తజన సందోహం మధ్యన గద్దెకు చేరిన సారలమ్మ!
మినీ మేడారం గా ప్రసిద్ధిగాంచిన అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతర మహా ఘట్టం బుధవారం మొదలైంది.

దిశ, ఆత్మకూర్ : మినీ మేడారం గా ప్రసిద్ధిగాంచిన అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతర మహా ఘట్టం బుధవారం మొదలైంది. భక్తజన సందోహం మధ్యన ముందుగా పూజారులు సాంప్రదాయ బద్ధకంగా పసుపు కుంకుమలను, ఘటం వరాల కుండలని, వనాన్ని గద్దెలకు తీసుకొచ్చారు. సారలమ్మ పూజారి గుల్లపెల్లి సాంబశివరావు ఇంటి నుండి సారలమ్మను భాజా భజంత్రీలు డప్పు చప్పులు శివసత్తుల పూనకాలు భక్తజన సందోహం మధ్యన గద్దెకు తీసుకొచ్చారు. ఎదురుకోళ్లు ఎగురవేసి సా రలమ్మను భక్తులు పొర్లుదండాలు పెట్టి అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో భక్తి పరవశ్య లో భక్తులు మునిగితేలారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కొబ్బరికాయలు పసుపు కుంకుమలు నిలువెత్తు బంగారంతో వనదేవతలను దర్శించుకున్నారు.
జాతరలో విస్తృతంగా వైద్య సేవలు: ఈసారి జాతరలో ఆత్మకూర్ మండల వైద్యాధికారి డాక్టర్ స్పందన నేతృత్వంలో సుమారు 50 మంది వైద్య బృందం సేవలందిస్తున్నారు. జాతరలో సంరక్ష ఆసుపత్రి వారు భక్తుల కోసం ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి విస్తృతంగా సేవలందిస్తున్నారు. జాతర ప్రత్యేక అధికారి ఆర్డీవో నారాయణ తాసిల్దార్ జగన్మోహన్ రెడ్డి. ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. జాతరలో మార్కెట్ చైర్మన్ బీరం సునంద సుధాకర్ రెడ్డి మాజీ చైర్మన్ బోరిగం స్వామి చైర్మన్ వంచ రంగారెడ్డి, అగ్రంపాడు సర్పంచ్ గంగుల మహేందర్ ఈవో నాగేశ్వరరావు పూజారులు జాతరలో విస్తృతంగా పర్యవేక్షిస్తున్నారు.






