- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుల గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచాం : మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటగా కుల గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి స్వాగతిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కొనియాడారు.

దిశ, మల్హర్(కాటారం): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటగా కుల గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి స్వాగతిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కొనియాడారు. కులగణ సర్వేను ఆడుకునేందుకు ప్రతిపక్షాలు అవగాహన రహిత్యతో విమర్శలు చేసిన వారి విమర్శలను పక్కనపెట్టి తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణన చేయాలని మొదటిగా డిమాండ్ చేయడంతో ఆ డిమాండ్ అనుకూణంగా రాష్ట్రంలో అమలు చేశాం.. ప్రజాస్వామ్యబద్ధంగా పూర్తి చేశామని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో ఇచ్చిన హామీల ప్రకారం ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇల్లు పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.గురువారం కాటారం మండలం, మంత్రి స్వగ్రామమైన ధన్వాడ గ్రామానికి చెందిన బొడిగె భాగ్య,చేకుర్తి పావని,ఆత్కూరి దుర్గ, తాటి పల్లవి లకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి నిర్మాణానికి శంకుస్థాపన, భూమి పూజ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంథని నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు మొదటి విడతలో 1733 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో ఇండ్లు లేని నిరుపేదలను ఎంపిక చేయడం జరిగిందని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ కార్యక్రమాన్ని మొదలు పెట్టి దిగ్విజయంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఇల్లు లేని పేదలు ఇల్లు కట్టుకోవాలని కన్న కలలు గత 10 సంవత్సరాలలో నెరవేరలేదని ఆనాటి ప్రభుత్వం ఇండ్ల నిర్మాణం చేయలేదని, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారి కళ్ళను నిజం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికె ఘనత దక్కిందని ఆయన పునర్ఘటించారు. మొదటి దశలో ఇంటి స్థలాలు ఉండి ఇండ్లు లేని వారిని ఎంపిక చేశామని, ఇండ్ల నిర్మాణాలను సబ్ కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. నిర్మాణంలో ఎప్పటికప్పుడు ఇండ్ల ప్రగతి ఫోటోలు పోర్టల్ లో అప్లోడ్ చేయాలని, తప్పుడు ఫోటోలు పోస్ట్ చేస్తే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏఐ ద్వారా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం 400 నుండి 600 ఎస్ఎఫ్టి వరకు పరిమితి ఉందని, కొలతలు పెంచడానికి అవకాశం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అర్హులైన ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం ఎమ్మా మీ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారని గ్రామస్తులను అడిగి తెలుసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను హైదరాబాద్, ఢిల్లీకి పంపిస్తానని తెలిపారు. బడిబాట కార్యక్రమాన్ని చేపట్టి బడిఈడు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించే విధంగా పెద్ద ఎత్తున అవగహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గృహ నిర్మాణశాఖ పిడి లోకిలాల్, డిఆర్డిఓ నరేష్, డిపిఓ వీరభద్రయ్య, గృహ నిర్మాణ శాఖ ఏఈ రాయలింగు, తహసిల్దార్ నాగరాజు,ఎంపీడీవో బాబు ఎంపీఓ వీరస్వామి తో పాటు వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.






