నిట్ వ‌రంగ‌ల్ లో మొద‌లైన స్ప్రింగ్ స్ప్రీ 2026 సాంస్కృతిక వేడుక‌లు

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-02-25 11:24:12  IST  )

నిట్ వరంగల్‌ విద్యార్థుల సృజనాత్మక ఆత్మ స్ఫూర్తి సాంస్కృతిక ఉత్సాహానికి ప్రతీక అయిన స్ప్రింగ్‌స్ప్రీ 2026 సాంస్కృతిక వేడుకలు తొలి ‘కర్టెన్ రైజర్’ కార్యక్రమం విశేష ఆకర్షణగా మొదలయ్యాయి.

నిట్ వ‌రంగ‌ల్ లో మొద‌లైన స్ప్రింగ్ స్ప్రీ 2026 సాంస్కృతిక వేడుక‌లు
X

దిశ‌, హ‌న్మ‌కొండ టౌన్ : నిట్ వరంగల్‌ విద్యార్థుల సృజనాత్మక ఆత్మ స్ఫూర్తి సాంస్కృతిక ఉత్సాహానికి ప్రతీక అయిన స్ప్రింగ్‌స్ప్రీ 2026 సాంస్కృతిక వేడుకలు తొలి ‘కర్టెన్ రైజర్’ కార్యక్రమం విశేష ఆకర్షణగా మొదలయ్యాయి. 40 అడుగుల ఎత్తైన ఉత్సవ బ్యానర్‌ను అధికారికంగా ఆవిష్కరించగా.. ఐదు నిమిషాల పాటు సాగిన అద్భుతమైన బాణసంచా ప్రదర్శన క్యాంపస్ లో ప్రతి ఒక్కరి మొహాల్లో వెలుగులు విరజమ్మాయి. అనంతరం నిర్వహించిన ‘ఎథ్నిక్ నైట్’ సాంస్కృతిక మహోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎన్ఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుద్ధి మాట్లాడుతూ “స్ప్రింగ్‌స్ప్రీ మా విద్యార్థుల సృజనాత్మక ఆత్మస్ఫూర్తి సాంస్కృతిక ఉత్సాహానికి ప్రతీక. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు.. ప్రతిభ, జట్టు భావం, నాయకత్వానికి వేడుక. నిర్వహణ బృందానికి నా శుభాకాంక్షలు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులంతా ఒక్క నిట్ వరంగల్ కుటుంబంగా కలిసి ఈ పండుగను జరుపుకోవాలని ఆహ్వానిస్తున్నాను” అన్నారు.


స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, స్ప్రింగ్‌స్ప్రీ 2026కు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు సహా వేలాది మంది అంతర్గత భాగస్వాములు పాల్గొంటున్నట్లు స్టేడియం, ఆడిటోరియం, ఎస్‌ఏసీ, ఏఎల్‌సీ, అకడమిక్ భవనాల్లో ఒకేసారి ఉత్సవం సురక్షితంగా, సాఫీగా జరిగేందుకు పూర్తి సంస్థాగత సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎస్‌ఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ పి. హరి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ అద్భుతమైన వేడుకకు మద్దతు ఇచ్చిన ఎస్‌బీఐ, అజారా హాస్పిటల్, మింత్రా, చాయ్ షాట్స్ తదితర స్పాన్సర్లకు మా కృతజ్ఞతలు” తెలిపారు. ఈ ఉత్సవం సమగ్ర విద్యార్థి అభివృద్ధికి సంస్థ ఇచ్చే ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. సమన్విత్ రెడ్డి, మహాదేవ్ మాట్లాడుతూ: “స్ప్రింగ్‌స్ప్రీ క్యాంపస్‌లో ప్రతి ఒక్కరి కోసం. సంగీతం, కళ, ఫోటోగ్రఫీ, సాహిత్యం లేదా పోటీలు – ప్రతి విద్యార్థికి తన వేదిక ఇక్కడ లభిస్తుందని స్వర్ణోత్సవానికి భారీ స్థాయి స్టేజ్ ఏర్పాట్లు, ప్రొఫెషనల్ సౌండ్ & లైటింగ్ సిస్టమ్స్, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు మరియు క్యాంపస్ అంతటా సమన్వయ ఏర్పాట్లతో స్ప్రింగ్‌స్ప్రీ 2026 నిట్ వరంగల్‌లో ఒక మైలురాయి సాంస్కృతిక వేడుకగా నిలిచిపోనున్నట్లు తెలిపారు. స్టూడెంట్ వెల్పేర్ డీన్ ప్రొఫెస‌ర్ కిర‌ణ్ కుమార్ మాట్లాడుతూ స్ప్రింగ్ స్ప్రీ 2026కు అధ్యాప‌కులు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story