- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ కథనానికి విశేష స్పందన.. కదిలిన జలమండలి యంత్రాంగం.
నాంపల్లి నియోజకవర్గ పరిధిలోనీ జలమండలి పనుల మందగమనం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం పై దిశ పత్రిక ప్రచురించిన కథనానికి అధికారులు తక్షణమే స్పందించారు.

దిశ, కార్వాన్ : నాంపల్లి నియోజకవర్గ పరిధిలోనీ జలమండలి పనుల మందగమనం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం పై దిశ పత్రిక ప్రచురించిన కథనానికి అధికారులు తక్షణమే స్పందించారు. నత్తనడకన జలమండలి పనులు.. రోడ్లను త్రవ్వి వదిలేయడంతో ప్రజలకు తప్పని ఇక్కట్లు" అంటూ స్థానికుల సమస్యలను వెలుగులోకి తెస్తూ ‘దిశ’లో వచ్చిన వార్త తో జలమండలి అధికారుల్లో కదలిక తెచ్చింది. కథనం ప్రచురితమైన వెంటనే జలమండలి మేనేజర్ జీవన్ శనివారం ఇందిరానగర్ పరిసర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. త్రవ్విన రోడ్లు, నిలిచిపోయిన పనులను ఆయన పరిశీలించారు. తాగునీటి సరఫరా, ఇతర జలమండలి పనుల వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరలోనే పనులన్నీ పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, వారం రోజుల్లోగా ఇందిరానగర్‌లో పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని మేనేజర్ జీవన్ హామీ ఇచ్చారు.






