- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానిక ఎన్నికలకు సన్నద్ధం..గ్రామాల్లో మళ్లీ మొదలైన సందడి
గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహించనుండటంతో ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, పేపర్లను, ఇతర పోలింగ్

= రాజకీయ పార్టీల నేతలతో అధికారుల సమావేశాలు
= సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వాహణకు ఏర్పాట్లు
= పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్న ప్రధాన పార్టీ నేతలు
= పాత రిజర్వేషన్ అనుగుణంగానే ఎలక్షన్
= గ్రామాల్లో మళ్లీ మొదలైన సందడి
దిశ,వరంగల్ బ్యూరో : ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతుంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఓటరు జాబితాపై నజర్ పెట్టారు. జాబితాను మరో దఫా పరిశీలించడంతో పాటు ఎన్నికల కోసం ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్,వార్డు సభ్యుల ఎన్నికలను మూడు దఫాల్లో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా రిజర్వేషన్లను ప్రకటించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. రాజకీయ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అధికారుల సమావేశంలో స్పష్టత ఇవ్వడంతో అధికారులు సిద్ధమవుతున్నారు. సర్పంచ్ ఎన్నికల నిర్వాహణకు ఓటరు జాబితా అభ్యంతరాలు పరిశీలించడం, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, రిజర్వేషన్ల ప్రక్రియ, ఉద్యోగులకు శిక్షణ వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికలు నిర్వహించేందుకు రెడీగా ఉన్నారు. జిల్లా స్థాయిలో అధికారులతో సమీక్షించడంతో పాటు రాజకీయ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వాహణపై మాట్లాడటంతో పాటు ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలకు కలెక్టర్లు వివరించారు. గత ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీకి ఏర్పాటు చేసిన రీతిలోనే ఈ ఎన్నికలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తెలపడంతో ఈ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
పాత రిజర్వేషన్ అనుగుణంగా..
గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహించనుండటంతో ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, పేపర్లను, ఇతర పోలింగ్ సామగ్రిని సిద్ధం చేసిన అధికారులు ఇతర ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడంతో పాటు బందోబస్తు చేపట్టనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా విడుదల కానుండటంతో ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు అందరూ హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు వేగంగా ఏర్పాట్లలో నిమగ్నం కావడంతో రాజకీయ పార్టీల నేతలు కూడా అప్రమత్తం అయ్యారు. గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పాత రిజర్వేషన్ అనుగుణంగా ఎన్నికలు నిర్వహించ నుండటంతో పోటీకి సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో రెండు లేదా మూడవ వారంలో ఎన్నికలు జరుగనుం డటంతో ఈ ఏర్పాట్లను చేసుకుంటున్నారు. పూర్తిస్థాయిలో పోటీకి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ చివరి లోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయావల్సిన డెడ్ లైన్ ఉండటం వల్ల గ్రామ, మండల నేతల్లో పోటీ పెరుగుతుంది. ఇద్దరు పిల్లల నిబంధనలు కూడా ఎత్తి వేయడం వల్ల ఎక్కువ మంది పోటీకి సిద్ధమవుతు న్నారు. ఈ దపా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం మళ్లీ గ్రామాల్లో మొదలవుతుంది.






