- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివాదంగా మారిన కొండా వ్యాఖ్యలు
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు ఉండగానే కొమ్మాల జాతర వేదికగా పరకాల నియోజకవర్గం గ్రూప్ రాజకీయాలు బయటపడ్డాయి.

కొమ్మాల సాక్షిగా కాంగ్రెస్లో గ్రూపులు
=ప్రభల జాతరలో బయటపడ్డ వర్గపోరు
=వచ్చే ఎన్నికల్లో కొండా కుటుంబమే పోటీ చేస్తుందని ప్రకటన
=పరకాల నియోజకవర్గంలో లుకలుకలు
=చర్చనీయాంశంగా మారిన కొండా వ్యాఖ్యలు
=అధిష్టానానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో రేవూరి వర్గీయులు
దిశ, వరంగల్ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు ఉండగానే కొమ్మాల జాతర వేదికగా పరకాల నియోజకవర్గం గ్రూప్ రాజకీయాలు బయటపడ్డాయి. జాతరలో ప్రభల ర్యాలీ సందర్భంగా కొండా మురళి తన కూతురు పరకాల నుంచి పోటీ చేస్తుందని ప్రకటించారు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అక్కడి నుంచే గతంలో ప్రాతినిధ్యం వహించారని, తమకు కలిసి వచ్చిందని తెలిపారు. వచ్చే ఎన్నికల కోసం పరకాల నుంచే కార్యకలాపాలను నిర్వహించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ లో దుమారం రేపాయి. దీనిపై ఎమ్మెల్యే రేవూరి వర్గీయులు అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రకటనతో పరకాల నియోజకవర్గం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ లో ఉన్న గ్రూపులు మరోసారి బయట పడ్డాయి.
పరకాలలో ఫైట్..
పరకాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన గతంలో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరిన ఆయన పరకాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఎమ్మెల్యేగా తన కార్యక్రమాలు నిర్వహిస్తూనే అభివృద్ధి పనులు చేస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా తన ముద్ర వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మళ్లీ మరోసారి కూడా పోటీ కోసం తన అనుచర వర్గంను పెంచుకుంటున్నారు. గడిచిన రెండేళ్లుగా రేవూరి, కొండ వర్గాల గ్రూపులు కొనసాగుతున్నాయి. కొమ్మాల జాతర వేదికగా మంగళవారం రాత్రి కొండా మురళి, ఆయన కూతురు పరకాల నియోజకవర్గం నుంచి పోటీచేస్తామని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. రెండు నియోజకవర్గాల్లో తామే ఉంటామని ప్రకటించడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పరకాల నియోజకవర్గం నుంచి గతంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ప్రాతినిథ్యం వహించారు. రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తన రాజకీయ అరంగేట్రం శాయంపేట నుంచి ఎమ్మెల్యేగా మొదలు పెట్టి తర్వాత పరకాల నుంచి ప్రాతినిత్యం వహించారు. అక్కడి నుంచే పలు దఫాలు ప్రాతినిథ్యం వహించిన ఆమె ప్రస్తుతం వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల సమయంలోనే పరకాల, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో రెండు టిక్కెట్ల కోసం ప్రయత్నాలు చేశారు. అప్పుడున్న పరిస్థితులతో అవకాశం రాలేదు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్న కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కూతురు సుశ్మిత పటేల్ ను బరిలోకి దించేందుకు గడిచిన కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
రాజకీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పరకాల నియోజకవర్గం నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ తరపున కొండా దంపతుల కూతురు సుశ్మిత పటేల్ పోటీ చేస్తానని ప్రకటించడం రాజకీయ వేడిని పెంచింది. ఉమ్మడి జిల్లా పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. గతంలోనే పరకాల నియోజకవర్గంకు సంబంధించి రెండు వర్గాల మధ్య విభేదాలు కొనసాగాయి. ఇప్పటికీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గం, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వర్గం పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండున్నరేళ్లు దగ్గర పడటం, వచ్చే రెండున్నర ఏళ్లలో ఎన్నికలు ఉండడంతో ఎవరికి వారే నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. గీసుగొండ మండలం కొమ్మాల జాతర వేదికగా చేసిన ఈ ప్రకటన వేడి పుట్టిస్తోంది. పరకాల కేంద్రంగా నియోజకవర్గ ప్రజలకు వారానికి రెండు రోజులు అందుబాటులో ఉంటామని ప్రకటించారు.
గీసుకొండ మండలం నుంచే రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన తాము పరకాల నియోజకవర్గంలో మళ్లీ ఎమ్మెల్యేగా ఉంటామని ప్రకటించారు. ఈ ప్రకటన కాంగ్రెస్ వర్గాల్లో ఉద్రిక్తతలను పెంచింది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండటం ఇంకా రెండున్నర ఏళ్ల సమయం ఉండగానే పోటీ గురించి ప్రకటించడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కొండా కుటుంబం చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లా రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించగా కాంగ్రెస్ లో చర్చ మొదలైంది. రేవూరి వర్గం మాత్రం ఎమ్మెల్యే ఉండగా ఇలాంటి ప్రకటన చేయడం జీర్ణించుకోవడం లేదు. అధిష్టానం దృష్టికి ఈ వ్యాఖ్యలను తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. కొండా వర్గం మాత్రం తమకు రాజకీయంగా కలిసి వచ్చిన గీసుకొండ మండలం, పరకాల నియోజకవర్గాన్ని వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేరు. వచ్చే ఎన్నికలకు పూర్తిస్థాయిలో రాజకీయ అరంగేట్రం కూతురు చేత చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా కొమ్మాల జాతర వేదికగా కాంగ్రెస్ లో ఉన్న గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి.






