నస్తూర్​పల్లిలో నల్ల బంగారం, కానీ మావోయిస్టుల ఎంట్రీ !

by velandi.Saikiran |   (  Updated:2026-03-04 21:45:21  IST  )

భూపాలపల్లి జిల్లాలో బొగ్గు గనుల నిక్షేపాలున్నట్లు సింగరేణి సంస్థ తో పాటు భూగర్భ శాఖ అధికారులు పరిశోధన చేశారు.

నస్తూర్​పల్లిలో నల్ల బంగారం, కానీ మావోయిస్టుల ఎంట్రీ !
X

నస్తూర్​పల్లిలో నల్లబంగారం..

=రెండు దశాబ్ధాల క్రితమే సింగరేణి సర్వే

=మావోయిస్టుల హెచ్చరికలతో సర్వే నిలిపివేత

==విస్తారంగా బొగ్గునిక్షేపాలు ఉన్నట్లు గుర్తింపు

=అవరోధంగా మారిన గుట్టలు, అటవీ ప్రాంతం

=ఆశగా ఎదురుచూస్తున్న స్థానిక ప్రజలు

దిశ భూపాలపల్లి ప్రతినిధి: గత రెండు దశాబ్దాల క్రితం భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తూర్​పల్లి ప్రాంతంలో బొగ్గు గనుల నిక్షేపాలున్నట్లు సింగరేణి సంస్థ తో పాటు భూగర్భ శాఖ అధికారులు పరిశోధన చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు నిక్షిప్తమై ఉన్నాయని సమాచారంతో నస్తూర్ పల్లి ప్రాంతంలో సింగరేణి సంస్థ సర్వే నిర్వహించింది. 25 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలో సర్వే నిర్వహిస్తున్న సంస్థలు మధ్యలోనే నిలిపివేశాయి. సర్వే సమయంలో మావోయిస్టులు హెచ్చరికలతో సర్వే అర్ధాంతరంగా ఆగిపోయింది. నస్తూర్ పల్లిలో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు సింగరేణి సంస్థ యజమానానికి నివేదికలు సమర్పించినప్పటికీ ఇంతవరకు ఈ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టలేదు. ప్రభుత్వం, సింగరేణి సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బొగ్గు గనులు ఎప్పుడు ప్రారంభిస్తారని స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్నారు..

అడవి, గుట్టల ప్రాంతంలో..

బొగ్గు నిక్షేపాలను గుర్తించిన నస్తూర్​పల్లి అడవి ప్రాంతం, గుట్టలు ఉండడంతో బొగ్గువెలికితీత సాధ్యాసాధ్యాలపై సింగరేణి సంస్థ ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. సింగరేణి సంస్థ బొగ్గు వెలికితీత ప్రారంభిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. నస్తూర్ పల్లి నుంచి 50 కి.మీ దూరంలో గోదావరిఖని, 30 కిలోమీటర్ల దూరంలో భూపాలపల్లి, 20 కిలోమీటర్ల దూరంలో తాడిచర్లలో బొగ్గు గనులు ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో సైతం బొగ్గు నిక్షేపాలునట్లు పరిశోధకులు చెబుతున్నారు. నస్తూర్​పల్లి అటవీ ప్రాంతం దాని చుట్టుపక్కల బొగ్గు గనులు వెలికితీత ప్రారంభిస్తే కాటారం, మహా ముత్తారం మహాదేవ పూర్ మండలం అభివృద్ధి చెందడంతోపాటు ఆ ప్రాంతంలోని యువకులకు ఉపాధి దొరికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై దృష్టిసారించి బొగ్గు నిక్షేపాలపై పూర్తిస్థాయిలో పరిశోధన చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Next Story