- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రిని చంపిన తనయుడు అరెస్ట్
వర్థన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని గుబ్బేటి తండాలో తన తండ్రిని హత్య చేసిన కేసులో పోలీసులు ఘన దర్యాప్తు తర్వాత నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

తండ్రిని చంపిన తనయుడు అరెస్ట్
- మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
దిశ, వర్థన్నపేట: మున్సిపాలిటీ పరిధిలోని గుబ్బేటి తండాలో తన తండ్రిని హత్య చేసిన కేసులో పోలీసులు ఘన దర్యాప్తు తర్వాత నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని సోమవారం ఏసీపీ నర్సయ్య మీడియాకు వెల్లడించారు. గుబ్బేటి తండాకు చెందిన సాపవత్ సురేష్ (27) 5వ తరగతి వరకు చదివి మధ్యలో చదువును మానేశాడు. వ్యవసాయం చేస్తూ, 2018 నుంచి ఆటో నడుపుతూ జీవనం సాగించాడు. 2019లో తాళ్లకుంట తండాకు చెందిన మోనికను వివాహం చేసుకున్నాడు. వీరి దాంపత్య జీవితంలో ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు పుట్టారు. సురేష్ తరచుగా మద్యానికి బానిసై భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొంత కాలంగా మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఇటీవల ఇంటికి వచ్చిన భార్యతో ఈనెల 6న రాత్రి సురేష్ తన తండ్రి ఇంటి వద్ద ఉన్నప్పుడు, భార్యతో గొడవ పడి దాడి చేయగా, తండ్రి అడ్డుకున్నాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన సురేష్ తండ్రిపై దాడి చేసి చీరను మేడకు చుట్టి హతమార్చాడు. సంఘటన తర్వాత సురేష్ వర్థన్నపేట బస్టాండ్ వద్ద సంచరిస్తుండగా పోలీసులు గమనించి అరెస్టు చేశారు. మాలోతు స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ సాయిబాబా, ఎమ్. రాజు గౌడ్లను సీపీ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.






