- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు
కొందరు అక్రమార్కులు మట్టి దందా చేపడుతున్నారు. ఎలాంటి అనుమతలు తీసుకోకుండానే యథేచ్ఛగా మట్టి రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమంగా తరలిస్తున్నప్పటికీ అధికారులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

దిశ నల్లబెల్లి: కొందరు అక్రమార్కులు మట్టి దందా చేపడుతున్నారు. ఎలాంటి అనుమతలు తీసుకోకుండానే యథేచ్ఛగా మట్టి రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమంగా తరలిస్తున్నప్పటికీ అధికారులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కన్నరావుపేట గ్రామ శివారులో కొందరు వ్యక్తులు జేసీబీలతో మట్టి తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లతో తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కన్నరావుపేట, శనిగరం, రామతీర్థం గ్రామాలతో పాటు మండల కేంద్రానికి మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఒక ట్రాక్టర్ మట్టికి రూ.900 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. మట్టిదందా రాత్రి పగలు తేడా లేకుండా జరుగుతున్నా కనీసం అధికారులు ఎవరూ పట్టించకపోవడంపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి అక్రమ దందాకు పాల్పడుతూ ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు, మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






