- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ కే డి ఆర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
27 ఏళ్ల అనంతరం మళ్ళీ ఓ పాఠశాల వద్ద స్నేహబంధాల సంధి... గతాన్ని తడిమిన అనుభూతులు, పిల్లవాడిలా మళ్ళీ ఒకసారి ఆటలతో, నవ్వులతో, మధుర జ్ఞాపకాలతో గడిపిన రోజు.

దిశ భీమదేవరపల్లి: 27 ఏళ్ల అనంతరం మళ్ళీ ఓ పాఠశాల వద్ద స్నేహబంధాల సంధి... గతాన్ని తడిమిన అనుభూతులు, పిల్లవాడిలా మళ్ళీ ఒకసారి ఆటలతో, నవ్వులతో, మధుర జ్ఞాపకాలతో గడిపిన రోజు. భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ శ్రీకృష్ణదేవరాయ హై స్కూల్‌కి చెందిన 1997–98 బ్యాచ్ విద్యార్థులు, తమ పాత రోజుల్ని తలచుకుంటూ, ఓ అనుబంధాలకు నిండి ఉన్న ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. చదువు ముగిసి ఎన్నో సంవత్సరాలు గడిచినా, క్షణం తీరిక దొరికిన వెంటనే ఒకచోట కలసి హృదయాల్ని మళ్ళీ కలిపారు.
భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ శ్రీకృష్ణదేవరాయ హై స్కూల్ చెందిన 1997-98 సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా 27 సంవత్సరాల క్రిందట తాము చదువుకున్న పాఠశాల రోజులు గుర్తు చేసుకున్నారు ఒకరికొకరు కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఆటపాటలతో రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు రాబోయే రోజుల్లో ఆరోగ్యం గురించి మెలకువలు పాటించాలని గుర్తు చేసుకున్నారు. కలిసి సహపంక్తి భోజనం చేశారు. మృతి చెందిన చదువు చెప్పిన గురువులు తోటి మిత్రులకు నివాళులర్పించి ఆపరేషన్ భారత్ సింధూర్ యుద్ధం లో జవాన్లకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ గూడ విశ్వవసు కోటేశ్వరరావు, గూడ వీరభద్రం, రేణుక రెడ్డి, అజ్గర్ అలీ, నీలం సంపత్, కాలేరు రాజన్న, రాజయ్య గౌడ్, బగ్గని మాధవి మధు, లతో పాటు 50 మంది పాల్గొన్నారు.






