- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెరిసిన గులాబీ జెండా..ప్లీనరీకి వేలాదిగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు..
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో నర్సంపేట పట్టణంలోని మార్కెట్ లో బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

దిశ, నర్సంపేట: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో నర్సంపేట పట్టణంలోని మార్కెట్ లో బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను, డివిజన్ లోని మండలాల వారీగా పార్టీ క్రియాశీల కార్యకర్తలను ప్లీనరీకి తీసుకొచ్చేలా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టారు. మంగళవారం ఉదయం నియోజక వర్గ వ్యాప్తంగా గ్రామాల్లో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గులాబీ జెండా ఎగురవేసి కార్యక్రమం ఉదయం 8 గంటలకు పూర్తి చేసి, ప్లీనరీకి బయలుదేరారు. మార్కెట్ లో ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు.
రూ.2 కోట్లతో భరోసా నిధి..
నర్సంపేట పట్టణంలోని మార్కెట్ లో ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉన్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం భరోసా నిధిని రూ.2 కోట్లతో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఏప్రిల్ నెల జీతం కార్యకర్తల భరోసా నిధికి విరాళంగా ఇస్తున్నట్లు పెద్ది ప్రకటించారు. ప్లీనరీలో మొత్తం 32 మంది సభ్యులతో 16 తీర్మానాలు ప్రవేశపెట్టారు. రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతున్నట్లు తెలిపారు. గత సంవత్సరం వడగళ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు నర్సంపేట నియోజకవర్గంలో రూ.11 కోట్లు అందించినట్లు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన 36 వేల మంది రైతులకు రూ.38 కోట్ల పంట నష్టం త్వరలో అందజేస్తామన్నారు.
పేదల సంక్షేమానికి పెద్ద పీట..
నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే పెద్ది తెలిపారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 12,500 కొత్త పెన్షన్స్ మంజూరు చేయించినట్లు తెలిపారు. 11 వేల మందికి రూ.110 కోట్ల కళ్యాణలక్ష్మి చెక్కులను ఇచ్చామన్నారు. నియోజకవర్గంలో దళిత బంధు 100 యూనిట్లు ఇచ్చామని, త్వరలో 1500 యూనిట్లు వస్తాయన్నారు. డివిజన్ వ్యాప్తంగా 76 నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు (తండాలు) చేసినట్లు తెలిపారు.
వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేయాలని ఉత్తర యుద్ధం చేసిన మొదటి నియోజకవర్గం నర్సంపేట అని స్పష్టం చేశారు. నర్సంపేట నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకులకు పని లేకుండా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని, పసలేని నాయకులకు విశ్రాంతినిచ్చే రోజులు వచ్చాయని ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే పెద్దిని స్పూర్తితో జడ్పీ వైస్ చైర్మన్ రూ. 2 లక్షలను భరోసా నిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.






