పిచ్చికుక్క దాడి.. ఏడుగురికి గాయాలు

by velandi.Saikiran |

ఇటీవల కుక్కకాటుకు గురైన పలువురికి రాబిస్ వ్యాధి సోకి మృత్యువాత పడిన ఘటనలు వింటూనే ఉన్నాం. రేబీస్ వ్యాధి పేరు

పిచ్చికుక్క దాడి.. ఏడుగురికి గాయాలు
X

దిశ, డోర్నకల్: ఇటీవల కుక్కకాటుకు గురైన పలువురికి రాబిస్ వ్యాధి సోకి మృత్యువాత పడిన ఘటనలు వింటూనే ఉన్నాం. రేబీస్ వ్యాధి పేరు వింటేనే వణికి పోతున్న క్రమంలో మండలంలో సోమవారం పిచ్చికుక్క దాడి ఘటన చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్లగూడెం గ్రామానికి చెందిన వృద్ధురాలు గురవమ్మ, వెంకన్న లతో పాటు మరో ఐదుగురుపై వీధి కుక్క దాడికి పాల్పడింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగు అందుకున్నారు.

తీవ్రంగా గాయపడిన బాధితులను ఖమ్మం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ క్రమంలో పలువురు మాట్లాడుతూ.. గ్రామంలో వీధి కుక్కలు జబ్బునపడి వీధుల్లో సంచరిస్తున్నాయి. టీకాలు అందించి నియంత్రించాల్సిన పశు వైద్యులు కన్నెత్తి చూడటం లేదని ఆరోపించారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో కుక్కల దాడిలో బాధితులుగా మారుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలసత్వం వీడి, వీధి కుక్కల నియంత్రణ,టీకాలు అందించుటకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story