- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వరంగల్ కలెక్టరేట్ : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ జి సంధ్యా రాణి పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. పాపన్న గౌడ్ జీవితం అందరికీ ఆదర్శమని, వారి ఆశయాలను కొనసాగించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మరియు నర్సంపేట ఆర్డిఓ కృష్ణవేణి, వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిని ఎ.పుష్పలత, మరియు గౌడ సంఘ నాయకులు యాదగిరి గౌడ్, చిర్ర రాజు గౌడ్, డా లక్ష్మీనారాయణ గౌడ్, రమేష్ గౌడ్, రాజేష్ కుమార్ గౌడ్, రమేష్ గౌడ్, సుధాకర్ గౌడ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






