- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ పాఠశాల అనుమతి రద్దు చేయాలి : సర్పంచ్
గ్రామంలో ప్రైవేటు పాఠశాల అనుమతులు రద్దు చేయాలని విద్యాశాఖకు గ్రామపంచాయతీ పక్షాన సిఫారసు చేస్తున్నట్టు ముప్పారం గ్రామ సర్పంచ్ గుంటిపల్లి రేణుక స్పష్టం చేశారు.

దిశ, ధర్మసాగర్ : గ్రామంలో ప్రైవేటు పాఠశాల అనుమతులు రద్దు చేయాలని విద్యాశాఖకు గ్రామపంచాయతీ పక్షాన సిఫారసు చేస్తున్నట్టు ముప్పారం గ్రామ సర్పంచ్ గుంటిపల్లి రేణుక స్పష్టం చేశారు. ప్రైవేటు పాఠశాలలకు పిల్లల్ని పంపితే ప్రభుత్వ రాయితీల్లో కోత విధిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు గ్రామపంచాయతీ పాలకవర్గం కూడా తీర్మానం చేసినట్టు చెప్పారు. గురువారం ముప్పారం ప్రాథమిక పాఠశాలలో జరిగిన పిల్లలు తల్లిదండ్రుల సమావేశంలో సర్పంచ్ రేణుక ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ బడిలో విద్యార్థుల పెంపు కోసం ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వార్డుల వారిగా ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి చదివే విద్యార్థుల జాబితాను తయారు చేయడంతో పాటు ప్రైవేటు బడులకు వెళ్లే వారిని గుర్తిస్తున్నామని వివరించారు.
ఒకవేళ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ బడులకు పంపిస్తే గ్రామంలో పెన్షన్లు, రేషన్, ఇందిరమ్మ ఇళ్లు ఇతరత్రా ప్రభుత్వ పథకాలను నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. మొదటి దశలో ప్రైవేటు పాఠశాలకు నోటీసులు ఇవ్వడంతో పాటు మండల జిల్లా విద్యాశాఖ అధికారులకు కూడా ప్రైవేట్ బడిని గ్రామం నుంచి ఎత్తివేయాలని కోరనున్నట్లు రేణుక వివరించారు. ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే యూనిఫాం, పుస్తకాలు, షూస్ తో సహా ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతలు, సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఇంటింటికీ వెళ్లి వివరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ తాళ్లపల్లి కుమారస్వామి గౌడ్, వార్డు సభ్యులు శ్వేత సాగర్, ఎతిరాజుల శోభ మల్లయ్య, గోకుల ప్రణీత సలీం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ పాల్గొన్నారు.






