గౌరవ వేతనం గ్రామ పంచాయితీ సిబ్బందికి ప్రకటించిన సర్పంచ్ బిల్లా యాదగిరి

by Ratna Kumari |

వేలేరు స‌ర్పంచ్ త‌న గౌర‌వ‌వేతనాన్ని ఐదు సంవ‌త్స‌రాల పాటు గ్రామపంచాయ‌తీ సిబ్బందికి ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు.

గౌరవ వేతనం గ్రామ పంచాయితీ సిబ్బందికి ప్రకటించిన సర్పంచ్ బిల్లా యాదగిరి
X

దిశ, ధర్మసాగర్ : వేలేరు మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు, వేలేరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికాలంలో వచ్చే గౌరవ వేతనాన్ని నెలకు రూ.6500లు, మొత్తం ఐదు సంవత్సరాలు కలుపుకొని రూ.3,90,000 గ్రామపంచాయతీ సిబ్బందికి ప్రకటించారు. ఈ సందర్భంగా వేలేరు సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిత్యం శ్రమపడుతున్న సిబ్బంది సేవలను గుర్తించి, వారు మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సర్పంచ్ వేతనాన్ని తమకు కేటాయించడంతో గ్రామపంచాయతీ సిబ్బంది గౌరవ సర్పంచ్ బిల్లా యాదగిరి కి కృతజ్ఞతలు తెలిపారు.

Next Story