- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్త జన సంగమం.. కాలేశ్వర క్షేత్రం.. నాలుగో రోజు కార్లన్నీ కాలేశ్వరం వైపే
కాలేశ్వర క్షేత్రం సరస్వతి పుష్కల సందర్భంగా భక్తజనంతో సంఘమంగా మారింది.

దిశ,మల్హర్(కాలేశ్వరం): కాలేశ్వర క్షేత్రం సరస్వతి పుష్కల సందర్భంగా భక్తజనంతో సంఘమంగా మారింది. నాలుగో రోజు ఆదివారం కావడం కార్లన్నీ కాలేశ్వరం వైపే ప్రయాణించడం పుష్కర స్థానానికి భక్తులు పోటెత్తారు దీంతో త్రివేణి సంగమం జనసంద్రంగా కిక్కిరిసింది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రియాయుధం.. త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం.తో భక్తులు పుష్కర స్థానాన్ని ఆచరించారు.త్రిలింగ క్షేత్రం, త్రివేణి సంగమ తీరానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నుంచి లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్త జనం కాలేశ్వరం చేరుకున్నారు. వాహనాల రాకపోకలకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు అధికారులు పకడ్బందీ చర్య లు ఏర్పాట్లు చేపట్టారు.ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా వాహనాల రాకపోకలు సాఫీగా సాగాయి. దీంతో భక్తుల రద్దీ పెరగడంతో కాలేశ్వర క్షేత్రంలో దైవ దర్శనానికి గంటల తరబడి భక్తులు క్యూ లైన్లో నిల్చున్నారు. దర్శనానికి కొంత ఆలస్యమైనా కలెక్టర్ ఆదేశాలతో ఆలయ సిబ్బంది చాకచక్యం వల్ల భక్తుల దర్శనానికి స్పీడ్ అప్ చేశారు.
సైకత లింగాలు...
సరస్వతి అంతర్వాహిని నది పుష్కరాలను పురస్కరించుకని భక్తులు త్రివేణి సంగమ తీరాన పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం గంగమ్మ ఒడిలో జంగమయ్యను ఆరాధిస్తున్నారు. సైకత లింగాలను తయారు చేసుకున్న భక్తులు శివ నామస్మరణలో చేస్తూ భక్తిని చాటుకుంటున్నారు. నది తీరంలో పవిత్ర స్నానాలు ఆచరించిన తరువాత నదీ తీరంలోనే సైకత లింగాలను తయారు చేసి శివుడిని ప్రత్యేకంగా పూజించే ఆనవాయితీని పాటించారు. అనంతరం త్రివేణి సంగమాన్ని పూజించి దీపారాధన చేసి గంగమ్మకు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆ తరువాత సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన 17 అడుగుల ఏకాశిల సరస్వతి మాతను, శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వామిని, శుభానంద దేవిని, సరస్వతి మాతను దర్శించుకుంటున్నారు. ఆధ్యాత్మికతతో ఉట్టిపడుతున్న త్రివేణి సంగమ తీరం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది.
మొంటెల వాయినం...
పుష్కరుడు సంచరించే వేళ ముత్తయిదలు మొంటెల వాయినం మొక్కులు తీర్చుకుంటున్నారు. సుభాషిణీలకు సాంప్రాదాయ బద్దమైన ఆచారంలో భాగంగా మొంటెల వాయినాలు ఇస్తూ వివాహితులు దీర్ఘ సుమంగలిగా ఉండేలా దీవెనలు అందుకుంటున్నారు.
కలెక్టర్ ఏరియల్ సర్వే...
త్రివేణి సంగమ క్షేత్రమైన కాళేశ్వరంలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్ రాహుల్ శర్మ హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. గగనంలో సంచరిస్తూ నది తీరం, వాహనాలు రాకపోకలతో పాటు దేవదాయ శాఖ చేసిన ఏర్పాట్లు, భక్తుల తదితర సేవలపై హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షించారు.
కాలేశ్వరం అందాల క్షేత్రం వీక్షించేందుకు జాయ్ రైడ్ ఏర్పాట్లు..
త్రివేణి సంగమం కాశి క్షేత్రం ప్రసిద్ధిగాంచిన కాలేశ్వరం అందాలను వీక్షించేందుకు జాయ్ రైడ్ హెలికాప్టర్ ను సిద్ధం చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. ముందుగా జాయ్ రైడ్ హెలికాప్టర్ లో కలెక్టర్ రాహుల్ శర్మ, కరీంనగర్ సిపి గౌస్ అలం, కరీంనగర్ స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్లు పుష్కర సన్నివేశాన్ని, భక్తజన సందేహ ప్రదేశాన్ని గోదావరి అడవుల అందాలను పరిశీలించారు. అనంతరం
కలెక్టర్ మాట్లాడుతూ సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు జాయ్ రైడ్ హెలికాప్టర్ ద్వారా త్రివేణి సంగమం, కాళేశ్వర దేవస్థానం, కాళేశ్వరం చుట్టు ప్రక్కల అడవులు తదితర అందాలను వీక్షించడానికి జాయ్ రైడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాయ్ రైడ్ టికెట్స్ బుక్కింగ్ కోసం హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన బుకింగ్ కేంద్రం ఒక్కరికి టికెట్ రూ. 4500 నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
భక్తుల సేవలో అధికారులు అలర్ట్ గా ఉండాలి: కలెక్టర్
సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తుల సేవలో అధికారులు అలర్ట్ గా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచిస్తూ సరస్వతి ఘాట్, భక్తులు పుణ్యస్నానాలు ఆచరించు త్రివేణి సంగమం, ఆరోగ్య శిభిరం, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయం, పుష్కర విధులు నిర్వహించు సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజన శాల తదితర ప్రాంతాలల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతున్నదని, రేపటి వరకు అదనంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని పీఆర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పుష్కర స్నానానికి భక్తులు వెళ్లేందుకు అదనంగా తాత్కాలిక రహదారి ఏర్పాట్లు, భక్తులు వ్యర్థాలు వేసేందుకు అదనంగా డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయాలని డిపిఓ ను ఆదేశించారు. సంగమ ప్రాంగణం మొత్తం డర్టీగా ఉందని, సాయంత్రం మళ్ళీ వస్తాను అప్పటీ వరకు మొత్తం పరిశుభ్రం చేయాలని స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్, డిపిఓకు వాకిటాక్ ద్వారా సూచించారు. మళ్లీ నా పర్యవేక్షణలో ఇలానే కనిపిస్తే పారిశుధ్యం సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
భక్తుల రద్దీ పెరుగుతున్నదని దేవస్థానంలో స్వామి దర్శనానికి క్యూ లో ఉన్న భక్తులను దర్శనానికి ఎంత సమయం పడుతుందని అడిగి తెలుసుకున్నారు. భక్తులకు దర్శనం త్వరగా అయ్యేలా చూడాలని దేవస్థానం సిబ్బందిని ఆదేశించారు. భద్రత, శుభ్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయా శాఖాల అధికారులను ఆదేశించారు. జిల్లా యంత్రాంగం కాళేశ్వరం లో జరుగుతున్న సరస్వతి పుష్కరాల విధుల నిర్వహణలో ఉన్నందున 19వ తేదీ సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు ఇవ్వడానికి కలెక్టరేట్ కు రావొద్దని ఆయన సూచించారు.
పుష్కర దర్శనానికి విచ్చేసిన అతిథులు
సరస్వతి పుష్కరాలకు కాలేశ్వరం విచ్చేసిన హై కోర్టు న్యాయమూర్తి సుధా కు పూల బొకే అందించి స్వాగతం పలికిన కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే, సాయంత్రం కాళేశ్వర క్షేత్రాన్ని చేరుకున్న పుష్ప గిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సభినవోద్దండ విద్యాశంకర భారతీ మహస్వామిని స్వాగతించారు. అనంతరం స్వామి పుష్కర స్నానం ఆచరించి. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకుని భక్తులకు ఆశీర్వచనం అందచేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఆర్జేసి రామ కృష్ణారావు, ఈఓ మహేష్, ఆలయ చైర్మన్ మోహన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రాత్రికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాజరు కానున్నట్లు తెలిసింది.






