- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరం పుష్కరాల్లో విషాదం..ఎండల తీవ్రతతో కార్మికుడి మృతి
by Bhanu |
కాళేశ్వరం సరస్వతి పుష్కరాలల్లో విధులు నిర్వహిస్తున్న పరిశుద్ధ కార్మికుడు ఎండ తీవ్రతకు మృతి చెందిన విషాద ఘటన మంగళవారం మహాదేవపూర్ ఆస్పత్రిలో జరిగింది.

X
దిశ,మల్హర్(కాళేశ్వరం) : కాళేశ్వరం సరస్వతి పుష్కరాలల్లో విధులు నిర్వహిస్తున్న పరిశుద్ధ కార్మికుడు ఎండ తీవ్రతకు మృతి చెందిన విషాద ఘటన మంగళవారం మహాదేవపూర్ ఆస్పత్రిలో జరిగింది. కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన మంతెన శ్రీనివాస్ (35) అనే వ్యక్తి కాళేశ్వరంలో పారిశుద్ధ్య కార్మికుడు (మల్టీపర్పస్ వర్కర్)గా 3 రోజులుగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ ఎండతీవ్రతకు తీవ్ర అస్వస్థకు గురి కావడంతో సోమవారం మహదేవ్పూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతునికి ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు భార్యలత ఉన్నట్లు సమాచారం. శ్రీనివాస్ మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story






