- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులను రుణ విముక్తులను చేయాలనేదే సంకల్పం : కడియం శ్రీహరి
వ్యవసాయాన్ని పండుగలా చేసి రైతన్నలను రుణముక్తి చేయాలన్న ఉద్దేశంతోనే, మన ముఖ్యమంత్రి 1 లక్ష 4 వేల కోట్ల పెట్టుబడి రైతులను ఆదుకుంటున్నాడని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

దిశ, లింగాలఘణపురం : వ్యవసాయాన్ని పండుగలా చేసి రైతన్నలను రుణముక్తి చేయాలన్న ఉద్దేశంతోనే, మన ముఖ్యమంత్రి 1 లక్ష 4 వేల కోట్ల పెట్టుబడి రైతులను ఆదుకుంటున్నాడని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రైతు నేస్తం రైతు భరోసా కార్యక్రమం లో భాగంగా మంగళవారం మండలంలోని బండ్లగూడ లోని రైతు వేదికలో జరిగిన ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తో కలిసి వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తొమ్మిది రోజుల్లోనే 70 లక్షల మంది రైతుల కుటుంబాలకు, 9 వేల కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం అని, రైతాంగానికి పెద్ద పీట వేసి కాంగ్రెస్ ప్రభుత్వం, రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని చాటుకుందని అన్నారు. ప్రతిపక్షాల అంచనాలను తలకిందలు చేసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారన్నారు.
అదేవిధంగా రైతుల రుణ విముక్తి చేయడం కోసం 25లక్షల మంది రైతులకు 21వేల కోట్ల రుణ మాఫీ చేశారన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి పూర్తి చేస్తున్నారని తెలిపారు . ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుతుందన్నారు. ప్రజా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు, రైతులు పూర్తి మద్దత్తు ఇవ్వాలని కోరారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 9మంది కి ముఖ్యమంత్రి సహాయ నిధి 2లక్షల 43వేల 500రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో రీజినల్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ అభి, మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరు శివకుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రామారావు నాయక్, ఏడిఏ వసంత సుగుణ, సివిల్ సప్లై డిఎం హాతిరామ్, ట్రాన్స్కో డి ఈ లక్ష్మీనారాయణ రెడ్డి, ఏడి అనిల్ కుమార్,తహసీల్దార్ రవీందర్, మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, నాయకులు మల్లారెడ్డి, గుడి వంశీధర్ రెడ్డి, బిట్ల బాబు, దూసర గణపతి, కృష్ణారెడ్డి, ఆంజనేయులు, తదితరులు






