ఆర్టీసీ బస్సు టైర్ పగిలి పెను ప్ర‌మాదం !

by velandi.Saikiran |

ఆర్టీసీ బస్సు టైర్ పగిలి ప్రయాణికుడికి కాలు విరిగిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా

ఆర్టీసీ బస్సు టైర్ పగిలి పెను ప్ర‌మాదం !
X

దిశ, పర్వతగిరి: ఆర్టీసీ బస్సు టైర్ పగిలి ప్రయాణికుడికి కాలు విరిగిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. వరంగల్ నుంచి పర్వతగిరికి వెళ్తున్న బస్సు నక్కలపల్లి ఊరు దాటగానే ఒక్కసారిగా టైర్ పగిలింది. అందులో ప్రయాణిస్తున్న కల్లెడ గ్రామానికి చెందిన బస్సులో ప్రయాణిస్తున్న రవికి లోపల ఉన్న రాడ్ కాలుకు బలంగా గుచ్చుకుంది. దీంతో మూడు చోట్ల బలమైన గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రుడిని చికిత్స కోసం ఎంజీఎంకు తరలించారు.

Next Story