వరంగల్ MGM ఆసుపత్రిలో ఊడిన పైకప్పు పెచ్చులు

by Muthe.Rajitha |

వరంగల్(Warangal) లోని MGM ఆసుపత్రి(MGM Hospital)లో తృటిలో ఓ భారీ ప్రమాదం తప్పింది.

వరంగల్ MGM ఆసుపత్రిలో ఊడిన పైకప్పు పెచ్చులు
X

దిశ, వెబ్ డెస్క్ : వరంగల్(Warangal) లోని MGM ఆసుపత్రి(MGM Hospital)లో తృటిలో ఓ భారీ ప్రమాదం తప్పింది. అసూపత్రిలోని పురుషుల సర్జికల్ వార్డు బిల్డింగ్ పైకప్పు(Slab) పెచ్చులు ఊడి కింద పడ్డాయి. సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఈ భవనం పూర్తిగా దెబ్బతిన్నదని, గతంలో కూడా పెచ్చులు ఊడి రోగులపై పడగా.. పలువురు గాయపడ్డారని సిబ్బంది తెలిపారు. ప్రతి ఏటా వర్షాకాలంలో సర్జికల్ వార్డులో ఇలాంటి ప్రమాదాలు జరగడం సాధారణం అయిందని, అధికారులు ఎవరూ బిల్డింగ్ మరమ్మత్తులను పట్టించుకోవడం లేదని రోగులు వాపోతున్నారు.

అయితే నగరంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతుండగా.. ఈ భవనానికి రిపైర్స్ అవసరమా అన్నట్టు యంత్రాంగం వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన హాస్పిటల్ మానిటరింగ్ సభ్యులు ఎంజీఎం ఆసుపత్రిలో పరిశీలన చేస్తుండగానే ఈ ఘటన జరగడం గమనార్హం. MGM ఆసుపత్రి.. రోజుకు 1,800 మంది ఔట్‌పేషెంట్లు, 1,200 మంది ఇన్‌పేషెంట్లతో ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాలకు సేవలందిస్తోంది. ఈ ఆసుపత్రి, 1,000 పడకల సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ అంతకు మించి రోగుల రద్దీ భారంతో సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కొరతను ఎదుర్కొంటోంది.

Next Story