రిటైర్డ్ ఏ.ఆర్. కానిస్టేబుల్ ఎం.డీ. గౌసుద్దీన్ మృతి

by Ratna Kumari |

మండ‌ల కేంద్రంలోని సూరారం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఏఆర్ కానిస్టేబుల్ ఎం.డి. గౌసుద్దీన్ బుధ‌వారం సాయంత్రం మృతి చెందారు.

రిటైర్డ్ ఏ.ఆర్. కానిస్టేబుల్ ఎం.డీ. గౌసుద్దీన్ మృతి
X

దిశ‌, ఎల్క‌తుర్తి : మండ‌ల కేంద్రంలోని సూరారం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఏఆర్ కానిస్టేబుల్ ఎం.డి. గౌసుద్దీన్ బుధ‌వారం సాయంత్రం మృతి చెందారు. ఆయ‌న మృతి వార్త పోలీస్ విభాగంలోనే కాకుండా స్వ‌గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గౌసుద్దీన్ విధి నిర్వ‌హ‌ణ‌లో క్ర‌మ‌శిక్ష‌ణ‌, నిజాయితీకి ప్ర‌తీక‌గా నిలిచారు. పోలీస్ శాఖ‌లో చేరిన‌ప్ప‌టి నుంచి అనేక ప్రాంతాల్లో సేవ‌లందించారు. హెడ్ క్వార్ట‌ర్స్ లో కొద్ది సంవ‌త్స‌రాలు ప‌ని చేసి త‌న విధేయ‌త‌ను చాటుకున్నారు. అలాగే ఏటూర్ నాగారం, కాజీపేట‌, ములుగు, వ‌ర్థ‌న్న‌పేట పోలీస్ స్టేష‌న్ల‌లో విధులు నిర్వ‌హించి ఉన్న‌తాధికారుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. సేవ‌లో ఉన్న స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌తో స్నేహ పూర్వ‌కంగా మెలిగారు. స‌హ‌చ‌ర సిబ్బందితో అనుబంధం పెంచుకున్నారు. ఆయ‌న మ‌ర‌ణం కుటుంబ స‌భ్యుల‌కు తీర‌ని లోటుగా మారింది. పోలీస్ అధికారులు, సిబ్బంది, గ్రామ‌స్తులు ఆయ‌న పార్థివ దేహానికి నివాళుల‌ర్పించి కుటుంబానికి సానుభూతి తెలియ‌జేశారు.

Next Story