దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. బ‌య్యారంలో గ్యాస్ కోసం భారీ క్యూ లైన్

by Ratna Kumari |

మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరి HP గ్యాస్ కార్యాలయం ఎదుట "బయ్యారంలో గ్యాస్ కోసం భారీ క్యూ లైన్ "అంటూ దిశ వెబ్ సైట్ లో వచ్చిన వార్తా కథనానికి గంట‌ల వ్య‌వ‌ధిలోనే స్పంద‌న ల‌భించింది.

దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. బ‌య్యారంలో గ్యాస్ కోసం భారీ క్యూ లైన్
X

దిశ‌, బ‌య్యారం : మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరి HP గ్యాస్ కార్యాలయం ఎదుట "బయ్యారంలో గ్యాస్ కోసం భారీ క్యూ లైన్ "అంటూ దిశ వెబ్ సైట్ లో వచ్చిన వార్తా కథనానికి గంట‌ల వ్య‌వ‌ధిలోనే స్పంద‌న ల‌భించింది. మహబూబాబాద్ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్ బయ్యారం రాజరాజేశ్వరి ఏజేన్సీ కార్యాలయం సంఘటన ప్రాంతానికి చేరుకొని గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు గ్యాస్ ఎప్పుడు వచ్చింది..? ఎవరెవరికి ఇచ్చారు..? గ్యాస్ గోడౌన్ లో స్టాక్ పై రిజిస్టర్ లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్యాస్ డోర్ డెలివరీ చేయాలని సూచించారు. వచ్చిన స్టాక్ ని బ్లాక్ చేస్తే ఏజెన్సీ రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించినట్లు సమాచారం. గ్యాస్ నిలువలు సరిపోను ఉన్నాయని.. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో త‌హ‌శీల్దార్ కే నాగరాజు, రెవెన్యూ సిబ్బంది ఆర్ఐ సందీప్, ఉపేందర్, జీపీఓలు ప్రభాకర్ పాల్గొన్నారు.

Next Story