16 సర్కిళ్లలో రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం

by velandi.Saikiran |

ఎన్పీడీసీఎల్ 16 సర్కిళ్లలోని వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి సాంకేతికతను

16 సర్కిళ్లలో రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం
X

దిశ హన్మకొండ టౌన్ : ఎన్పీడీసీఎల్ 16 సర్కిళ్లలోని వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి సాంకేతికతను అందిపుచ్చుకొని రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం ను సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే ఆధునాతన టెక్నాలజీ అయిన రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టంను ఎన్పీడీసీఎల్‌లో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇందులో రియల్ టైంలో కచ్చితమైన సమాచారం పొందగలుగుతామని, తద్వారా వేగవంతంగా చర్యలు చేపట్టవచ్చని వివ‌రించారు. ఒడిశాలో ఈ టెక్నాలజీ వాడుతున్నారని తెలిపారు. ఎన్పీడీసీఎల్‌కు అనుగుణంగా ఈ టెక్నాలజీ సరిపడేలా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. వరంగల్ హెడ్‌క్వార్టర్స్‌లో స్కాడాకు సబ్‌స్టేషన్ల కొరకు కొత్త సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్త సబ్‌స్టేషన్లను దృష్టిలో ఉంచుకొని రాబోయే 15 సంవత్సరాలకు సంబంధించి సాఫ్ట్‌వేర్ పరంగా సర్వర్లను ఏర్పాటు చేశామని తెలిపారు.

Next Story