ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం

by velandi.Saikiran |   (  Updated:2025-11-05 14:19:57  IST  )

తొర్రూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన చిన్నారిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు.

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం
X

దిశ, తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో స‌మాజం త‌ల‌దించుకునే సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆరేళ్ల పాపపై అత్యాచార యత్నం చేసిన ఘటన స్థానికులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే— తొర్రూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన చిన్నారిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు, నిందితుడి ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. దీంతో నిందితుడి తల్లిదండ్రులే కోపోద్రిక్తులై బాధితురాలి తండ్రిపైనే దాడి చేసినట్టు సమాచారం. ఇక బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఫోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు తొర్రూరు సబ్‌ ఇన్‌స్పెక్టర్ గొల్లమూడి ఉపేందర్ తెలిపారు. ఈ సంఘ‌ట‌న‌పై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story