బంగారు పతకం సాధించిన రంజిత్ దత్త‌

by Ratna Kumari |   (  Updated:2026-02-11 09:49:52  IST  )

సీఎం కప్ లో భాగంగా జిల్లా స్థాయి అండర్ 14 స్కేటింగ్ గేమ్ లో వరంగల్ మహానగర పరిధిలోని 16 వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన కొత్తపల్లి రంజిత్ దత్త ప్రథమ స్థాయిలో గెలుపొంది బంగారు పతకం కైవసం చేసుకున్నాడు.

బంగారు పతకం సాధించిన రంజిత్ దత్త‌
X

దిశ, గీసుకొండ : సీఎం కప్ లో భాగంగా జిల్లా స్థాయి అండర్ 14 స్కేటింగ్ గేమ్ లో వరంగల్ మహానగర పరిధిలోని 16 వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన కొత్తపల్లి రంజిత్ దత్త ప్రథమ స్థాయిలో గెలుపొంది బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. వరంగల్ మహానగర పరిధిలోని 16 డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన కొత్తపల్లి ప్రభాకర్ ఉమా దంపతుల ఇద్దరు కుమారులు క‌ల‌రు.పెద్దవాడైన రంజిత్ దత్త వరంగల్ శ్రీ చైతన్య హై స్కూల్ లో 8 వ తరగతి చదువుతున్నాడు. రంజిత్ దత్త కి చిన్నప్పటి నుంచే స్కేటింగ్ పై మక్కువ కలిగి కోచ్ పవన్ కుమార్ వద్ద శిక్షణ పొందాడు. సీఎం కప్ జిల్లా స్థాయి అండర్ 14 స్కేటింగ్ లో ప్రథమ బహుమతి గెలుపొంది బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. బంగారు పతకాన్ని డీఎస్ డీఓ అనిల్ కుమార్ చేతుల మీదుగా ఓ వరంగల్ సిటీలో పథకాన్ని అందుకున్నాడు. ఈ నెల 20, 21, 22 తేదీలలో హైదరాబాద్ సరూర్ నగర్ లో రాష్ట్ర స్థాయి స్కేటింగ్ ఎంపిక అయ్యాడు. గ్రామ ప్రజలు రంజిత్ దత్త బంగారు పతకం అందుకోవడతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story