రాజీవ్ ఆరోగ్య శ్రీ నా ప్రాణాలు కాపాడింది

by velandi.Saikiran |   (  Updated:2025-08-19 10:54:37  IST  )

రాజీవ్ ఆరోగ్యశ్రీ నా ప్రాణాలు కాపాడిందని రంపిస లింగాభాయి తెలిపారు. మండలంలోని వెంకట్రావుపల్లి (సి )గ్రామానికి

రాజీవ్ ఆరోగ్య శ్రీ నా ప్రాణాలు కాపాడింది
X

దిశ, చిట్యాల: రాజీవ్ ఆరోగ్యశ్రీ నా ప్రాణాలు కాపాడిందని రంపిస లింగాభాయి తెలిపారు. మండలంలోని వెంకట్రావుపల్లి (సి ) గ్రామానికి చెందిన రంపిస లింగభాయినీ మండల కేంద్రంలోని, ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలోని విధులు నిర్వహిస్తున్న, ఆరోగ్య మిత్ర గుర్రపు రాజమౌళి మంగళవారం పేషెంట్ ను కలిసి వివరాలు సేకరించారు. ఈనెల 10 న తమ ఇంటి సమీపంలో కాలుజారి కింద పడగా, ఆమె ఎడమ కాలు విరిగింది. గమనించిన కుటుంబ సభ్యులు పరకాల పట్టణంలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అయినా సుశ్రుత హాస్పిటల్ కి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షించి తెల్ల రేషన్ కార్డు ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద, ఆమెకు ఉచితంగా ఆపరేషన్ చేశారు.


ఈ సందర్బంగా రంపిస లింగాభాయి మాట్లాడుతూ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం నా ప్రాణాలను కాపాడిందని పేర్కొన్నారు. ఆపరేషన్ కోసం హాస్పిటల్ వారు నా వద్ద చిల్లిగవ్వ కూడా తీసుకోకుండా, ఉచితంగా ఆపరేషన్ చేసి నాణ్యమైన వైద్యం అందించి, ఉచిత భోజన వసతి, రవాణా చార్జీలు, మెడిసిన్ అందించి, తన ఇంటికి చేర్పించారని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం లేకపోతే అప్పుల పాలు అయ్యేదని ఇబ్బందులు పడే వారమని ఆమె పేర్కొన్నారు. నా ప్రాణాలు కాపాడిన రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ నిఖిల్ స్వరూప్, ఎండి జనరల్ మెడిసిన్ డిస్ట్రిక్ట్ మేనేజర్ పి విక్రమ్, టీం లీడర్ యామంకి అనిల్, సుశ్రుత హాస్పిటల్ వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.


Next Story