- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాడి పశు సంపదను రైతులు పెంపొందించుకోవాలి
జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గోపాలమిత్ర సభ్యుల సమక్షంలో మండల పరిధిలోని వడ్డే కొత్తపల్లి గ్రామంలో వైద్యాధికారి డా.బి. రాజశేఖర్ ఉచిత గాలికుంటు, గర్భకోశ వ్యాధుల చికిత్స నివారణ టీకాల శిబిరం నిర్వహించారు.

దిశ, పెద్దవంగర: జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గోపాలమిత్ర సభ్యుల సమక్షంలో మండల పరిధిలోని వడ్డే కొత్తపల్లి గ్రామంలో వైద్యాధికారి డా.బి. రాజశేఖర్ ఉచిత గాలికుంటు, గర్భకోశ వ్యాధుల చికిత్స నివారణ టీకాల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక విజయ డైరీ చైర్మన్ రాసాల సమ్మయ్య రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ... పాడి రైతులు పశువులలో యద లక్షణాలను గుర్తించి సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించుకోవాలని పేర్కొన్నారు.
కేవలం ఆడదూడలు పుట్టే లింగ నిర్ధారణ చేసిన సెక్స్ సార్టెడ్ సెమెన్ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, పశు వైద్యశాల, గోపాల మిత్రుల వద్ద అందుబాటులో ఉంటుందని ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దంతాలపల్లి పరశురాములు,ఉప సర్పంచ్ ఎర్రగొర్ల రమేష్,వార్డ్ మెంబర్లు బొల్లు ఉషయ్య,కేశబోయిన సుభాష్ చంద్రరాజు, గోపాలమిత్ర సూపర్వైజర్ ఎమ్. అనిల్, యాదవ సంఘం సభ్యులు మల్లయ్య యాదవ్, కొమురమళ్ళు యాదవ్, గోపాల మిత్రులు వెంకన్న,చంద్రశేఖర్, ఓ.ఎస్ హసన్, డి.శ్రీనివాస్, రైతులు యాకయ్య, సంపత్, సుధాకర్, శ్రీనివాస్, నారాయణ, నవీన్,సోంబాబు,బయన్న,కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.






