- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదల బియ్యం పెద్దల పాలు.. లబ్ధిదారుల నుంచి కేజీ రూ.20లకు కొనుగోళ్లు
పేద, మధ్య తరగతి కుటుంబాలు సన్న బియ్యం కడుపునిండా తిని ఆనందంగా ఉండాలనే సదుద్దేశంతో ప్రభుత్వం సన్న బియ్యం పథకం ప్రవేశ పెడితే అది కాస్త దళారులకు ఆదాయంగా మారింది.

దిశ, భూపాలపల్లి ప్రతినిధి : పేద, మధ్య తరగతి కుటుంబాలు సన్న బియ్యం కడుపునిండా తిని ఆనందంగా ఉండాలనే సదుద్దేశంతో ప్రభుత్వం సన్న బియ్యం పథకం ప్రవేశ పెడితే అది కాస్త దళారులకు ఆదాయంగా మారింది. జిల్లాలోని 12 మండలాలలో మండలానికి ఒక ముఠా ఏర్పడి సన్నబియాన్ని లబ్ధిదారుల వద్ద కిలో 20 రూపాయల కొనుగోలు చేసి ఆ బియ్యాన్ని పక్క రాష్ట్రాలకు విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో దొడ్డు బియ్యం ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన సమయంలో ఆ బియ్యాన్ని పేద ప్రజలు తినడం లేదనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం ప్రవేశపెట్టి పేద ప్రజలందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఆలోచన చేసింది. ఆలోచన ఆచరణలోకి రాకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. కొంతమంది దళారులు లబ్ధిదా రులను మోసం చేస్తూ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా జరుగు తున్నప్పటికీ నిఘా కేంద్రాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లాలో ప్రతిరోజు పోలీస్ అధికారులు కొంత మంది ఇచ్చిన సమాచారంతో ఏదో ఒక ప్రాంతంలో సన్నబియ్యాన్ని పట్టుకుని కేసులు చేస్తున్నప్పటికీ దళాలు మాత్రం తమ దందా ఆపడం లేదు.
భూపాల్ పల్లి జిల్లాకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్రకు సన్న బియ్యం తరలిపోతున్నాయి.
కాళేశ్వరం బ్రిడ్జి వద్ద అధికారులు చెక్ పోస్ట్ పెట్టకపోవడంతో సన్న బియ్యం రాత్రంతా ఈ ప్రాంతం నుంచి మహారాష్ట్లలోని రైస్ మిల్లుకు చేరుతున్నాయి. సన్నబియ్యం ఈ ప్రాంతంలో 20 రూపాయల కిలో కొనుగోలు చేసుకుని మహారాష్ట్రలో మాత్రం 40 రూపాయల వ్యక్తులకు అమ్ముతూ లక్షలు గడిస్తున్నారు. మండలానికి ఒక ముఠా తయారు చేసిన ఆ యజమాని ముందస్తుగానే డబ్బులు వారికి అప్పజెప్పి కొంతమందిని తమ కంట్రోల్లోకి తీసుకొని బియ్యాన్ని తమ రైస్ మిల్లుకు తీసుకొని లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం దొడ్డు బియ్యం సరాపరా చేసే సమయంలో ఈ ప్రాంతంలో దొడ్డు బియ్యాన్ని సైతం అదే వ్యక్తి కొనుగోలు చేసి లక్షలు గడించిన సంగతి ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ ప్రాంతంలోని అధికారులకు నాయకులకు ఈ ప్రాంతంలోని దొడ్డుబియ్యం కొనుగోలు చేసిన వ్యక్తి సన్నబియ్యం కొంటున్నారనే విషయం బహిర్గతం అయినప్పటికీ అధికారులు అతని పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.మహారాష్ట్ర చట్టాలు అతనికి అనుకూలంగా ఉండడంతో అక్కడ అధికారులు ఆయనను ఏమి చేయలేకపోతున్నారు. మహారాష్ట్రలో బియ్యం పట్ల పట్టుకోవడం పట్ల ఎలాంటి నియమ నిబంధన లేకపోవడంతో ఆ యజమానికి చేసిన పనులకు ఎవరు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
మండల కేంద్రంగా ముఠాలు...
జిల్లాలోని 12 మండలాల్లో మండలానికి ఒక ముఠాను ఏర్పాటు చేసి ఆ ముఠా వర్గానికి చెందిన వారే బియ్యాన్ని మహారాష్ట్ర ప్రాంతానికి తరలించే ఏర్పాటు చేశారు. గ్రామాల్లో కొంతమంది పేదల వద్దకు వెళ్లి బియ్యం సేకరించి పది క్వింటాళ్లకు పైగా బియ్యం సేకరించిన అనంతరం చిన్నచిన్న వాహనాల్లో మహారాష్ట్రకు తరలించే ప్రణాళికను చేసుకున్నారు. ఉదయం లేదా రాత్రివేళలో మాత్రమే బియ్యం అక్రమ రవాణా ముమ్మరంగా జరిగే ఏర్పాటు చేసుకున్నారు. గ్రామాల్లో కొంతమంది గతంలో అక్రమ బియ్యం దందాలు చేసి మానుకొన్న వారు ప్రస్తుతం బియ్యం దందా చేస్తున్నవారిపై అధికారులకు సమాచారమిస్తున్నారు.అధికారులు వారిపై ఎలాంటి నిఘా పెట్టడం లేదని ఆరోపణలు ఉన్నాయి. భూపాల పల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరం బ్రిడ్జి వద్ద పోలీస్ అధికారులు చెక్పోస్ట్ ఏర్పాటు చేసి అక్రమ బియ్యం దందా ను అరికట్టే అవకాశం ఉంది. పోలీస్ అధికారులు కఠినంగా ఉంటే తప్ప తనిఖీ కేంద్రం వద్ద బియ్యం అక్రమ రవాణా తగ్గే అవకాశాలు లేవు. కాలేశ్వరం బ్రిడ్జితోపాటు మంచిర్యాల జిల్లా ప్రాణహిత వద్ద ఉన్న బ్రిడ్జి వద్ద సైతం పోలీస్ అధికారులు తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసినచో అక్రమ దందాకు చెక్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.






