- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ వాహనాల బహిరంగ వేలం పాట
అక్రమ నాటు సారాయి, బెల్లం సరఫరాలో పట్టుబడిన వాహనాలను బహిరంగంగా వేలం వేసిన ఘటన తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది.

దిశ, తొర్రూర్ : అక్రమ నాటు సారాయి, బెల్లం సరఫరాలో పట్టుబడిన వాహనాలను బహిరంగంగా వేలం వేసిన ఘటన తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. తొర్రూరు డివిజన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ వేలం పాటను గురువారం ఉదయం 11 గంటలకు తొర్రూరు ఎక్సైజ్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ బుస అశోక్ మాట్లాడుతూ, వరంగల్ డిప్యూటీ కమిషనర్ జి. అంజన్ రావు ఆదేశాల మేరకు, జిల్లా డిపిఈఓ కిరణ్ సమన్వయంతో ఈ బహిరంగ వేలం పాట చేపట్టినట్లు తెలిపారు. మొత్తం 36 వాహనాలను వేలంకు ఉంచగా, 28 వాహనాలు, ఆర్టీఓ నిర్ణయించిన ధర 2,95,500 రూపాయలు.
కానీ వేలంలో అంతకన్నా అధిక ధరలకు విక్రయమయ్యాయని వెల్లడించారు. మిగతా 8 వాహనాలు విక్రయదారులు ఆసక్తి చూపలేదని తెలిపారు. ఈ వేలం పాట ద్వారా ప్రభుత్వం రూ. 8,12,000 ఆదాయం జిఎస్టి 1,09,000 రూపాయలతో కలుపుకొని మొత్తం 9,21,560 రూపాయలు పొందిందని తెలిపారు. వేలంలో పాల్గొన్న వాహనాలు తొర్రూరు, చిన్నవంగర, నారసింహులపేట, దంతలపెల్లి మండలాలకు చెందినవని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఈఓ కిరణ్, ఎక్సైజ్ ఎస్‌ఐలు రవలి రెడ్డి, ఎన్. శంకర్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, సత్య ప్రసాద్, ప్రభాకర్, గౌస్ పాషా, హరీష్,శశివర్థన్, తదితరులు పాల్గొన్నారు.






