- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేద ప్రజల పాలిట కల్పవృక్షం ఉపాధి హామీ పథకం
కాంగ్రెస్ హయాంలో దేశంలో స్వర్ణయుగం ఉన్నదని, అట్టడుగు వర్గాల ప్రజలకు మెరుగైన పాలన అందించామని నాయిని రాజేందర్ రెడ్డి

దిశ, హన్మకొండ కలెక్టరేట్: కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దేశంలో స్వర్ణయుగం ఉన్నదని, అట్టడుగు వర్గాల ప్రజలకు మెరుగైన పాలన అందించామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించాలని బిల్లు ప్రవేశపెట్టిన క్రమంలో ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు ఆదివారం హనుమకొండ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక సంక్షేమ పథకం కాదు,ఇది చట్టబద్ధమైన హక్కు అన్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వలసలు తగ్గాయి, స్థానికంగా ఉపాధి కల్పన జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి లు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,ఈ.వి శ్రీనివాస్ రావు,టీపీసీసీ మెంబర్ బత్తిని శ్రీనివాస్ రావు,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్,మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్పొరేటర్లు,మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






