రోడ్డు భద్రతపై అవగాహనతో ప్రమాదాల నివారణ సాధ్యం : కలెక్టర్ డా. సత్య శారద

by Ratna Kumari |

రోడ్డు భ‌ద్ర‌త పై అవ‌గాహ‌న‌తో ప్ర‌మాదాల నివార‌ణ సాధ్యం అని క‌లెక్ట‌ర్ డా.స‌త్య శార‌ద పేర్కొన్నారు.

రోడ్డు భద్రతపై అవగాహనతో ప్రమాదాల నివారణ సాధ్యం :   కలెక్టర్ డా. సత్య శారద
X

దిశ, వరంగల్ బ్యూరో : రోడ్డు భ‌ద్ర‌త పై అవ‌గాహ‌న‌తో ప్ర‌మాదాల నివార‌ణ సాధ్యం అని క‌లెక్ట‌ర్ డా.స‌త్య శార‌ద పేర్కొన్నారు. శుక్ర‌వారం వరంగల్ జిల్లా జక్కలోద్ధి గ్రామంలోని టీజీఎంఆర్ఈఐఎస్ పాఠశాలలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమంలో క‌లెక్ట‌ర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ వినియోగం, పాదచారుల భద్రత, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

చిన్న వయస్సులోనే ఈ అలవాట్లు పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో సురక్షిత సమాజ నిర్మాణానికి తోడ్పడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్‌ను పరిశీలించిన కలెక్టర్, అవసరమైతే అదనంగా కంప్లైంట్ బాక్స్‌లు ఏర్పాటు చేయాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిని ఆదేశించారు. విద్యార్థులు తమ సమస్యలను స్వేచ్ఛగా తెలియజేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రోడ్డు భద్రతపై విలువైన సూచనలు తెలుసుకున్నారు. అనంతరం ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ రోడ్డు భద్రతను ప్రోత్సహిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంధ్యా రాణి, ఆర్డీవో వరంగల్ సుమ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రమేష్, జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు, డీబీసీడీఓ పుష్పలత, డీఎస్సీడీఓ భాగ్యలక్ష్మి, డీఎస్సిడిఓ, ఎంవీఐ జయపాల్ రెడ్డి, మమ్నూర్ ఎస్‌ఐ శ్రీకాంత్, తహసీల్దార్ ఇక్బాల్, ప్రిన్సిపల్ బిక్షపతి పాల్గొన్నారు.

Next Story