జాతీయ రహదారిపై గుంతలు

by Ratna Kumari |

ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడ్ గ్రామ సమీపంలోని వ్యవసాయ మార్కెట్ కు వెళ్లే క్రాస్ వద్ద ఉన్న జాతీయ రహదారి 163 పై పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి.

జాతీయ రహదారిపై గుంతలు
X

దిశ, ఆత్మకూర్ : ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడ్ గ్రామ సమీపంలోని వ్యవసాయ మార్కెట్ కు వెళ్లే క్రాస్ వద్ద ఉన్న జాతీయ రహదారి 163 పై పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. ప్రయాణికులు అటువైపు వెళ్లాలంటే జంకుతున్నారు. రాత్రి వేళ లో హనుమకొండ నుంచి ములుగు వైపు వెళ్లే జాతీయ రహదారిపై పెద్ద గుంతలు ఉండటంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. జాతీయ రహదారి పై ఉన్న గుంతలను అధికారులు వాటి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని అధికారులపై ప్రజలు మండిపడుతున్నారు. వాటి వ‌ల్ల‌ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాటిని వెంటనే గుర్తించి.. జాతీయ రహదారి పై ఎలాంటి గుంతలు లేకుండా చూడాలని, ఆ గుంతలను వెంటనే పూడ్చాలని కోరుతున్నారు.

Next Story