మీ ఎన్నికల్లో మీ కన్నా ఎక్కువ శ్రమపడుతా: మంత్రి పొన్నం

by Bhanu |   (  Updated:2025-05-23 11:27:38  IST  )

తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా పార్టీని బలపర్చే లక్ష్యంతో, భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది.

మీ ఎన్నికల్లో మీ కన్నా ఎక్కువ శ్రమపడుతా: మంత్రి పొన్నం
X

దిశ భీమదేవరపల్లి: తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా పార్టీని బలపర్చే లక్ష్యంతో, భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గ్రామ, మండల, బ్లాక్ స్థాయిలకు యువరక్తాన్ని చేర్చడం ద్వారా పార్టీని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అనుబంధ సంఘాలు, మహిళా విభాగాలు, బూత్ స్థాయి నేతలు అందరూ దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను పార్టీ కార్యకర్తలు మోసాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

మంత్రి మాట్లాడుతూ, “గత ప్రభుత్వ హామీలను కొనసాగిస్తూ, కొత్తగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, గ్యాస్ సిలిండర్ రూ. 500, ఆరోగ్య శ్రీ రూ. 10 లక్షలు, ఇళ్ల రుణ మాఫీ, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను అమలు చేస్తున్నాం. గత 10 ఏళ్లలో ఇచ్చిన 443 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో, మల్కనూరుకు 243, హుస్నాబాద్ టౌన్‌కి 140, మండలానికి 60 ఇళ్లను కేటాయించాం. ప్రస్తుతం ఏ ఏడాదికైనా 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడమే లక్ష్యం,” అన్నారు.

పేదలకు సన్నబియ్యం, ట్రాక్టర్ల పంపిణీ, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఆర్టీసీ బస్సుల కొనుగోలు, గ్రామాల్లో తాగునీరు, సీసీ రోడ్లు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. హనుమకొండ జిల్లాలో వంగర వద్ద నవోదయ పాఠశాల, దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా నీటిపంపిణీ వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గం అంటే ఎక్కడికి వెళ్లిన గౌరవం పెంపొందించేలా చేస్తున్నామని తెలిపారు. సిఎంఆర్ఎఫ్ లు , కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరే ఇచ్చేలా చేస్తున్నామని చెప్పారు.రేపు రాబోయే ఎన్నికల్లో భీమదేవరపల్లి మండలంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి.

నా ఎన్నికల్లో మీరు కష్టపడ్డారు..పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ ఇచ్చారు. మీ ఎన్నికల్లో మీ కన్నా ఎక్కువ శ్రమపడుతాను. గ్రామ శాఖ అధ్యక్షుడు,ఉపాధ్యక్షుడు ,ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెల్ అధ్యక్షులను ఎన్నుకోవాలి. వచ్చే ఎన్నికల్లో భీమదేవరపల్లి మండలంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని, పార్టీకి మరింత బలం చేకూర్చాలని కార్యకర్తలను ఆయన ఆహ్వానించారు.

Next Story