పేదవారి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పొంగులేటి

by Bhanu |

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ చిత్తశుద్ధితో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అమలు చేస్తున్నామని, పేద వాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

పేదవారి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పొంగులేటి
X

దిశ‌, ఏటూరునాగారం: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ చిత్తశుద్ధితో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అమలు చేస్తున్నామని, పేద వాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ములుగు జిల్లాలోని వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజా, నాగారం నుండి పాయబట్ల వరకు 400 లక్షలు తో బి.టి రోడ్డు నిర్మాణ పనులు, 1.50 లక్షల అంచనా విలువ తో వాజేడు మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవన నిర్మాణం, ఎడ్చర్లపల్లి నుండి ముత్తారం వరకు 300 లక్ష తో బి.టి. రోడ్డు నిర్మాణం పనులను శంకుస్థాపనలు, 14 లక్షలతో నిర్మించిన బేబీ బర్త్ వెయిటింగ్ భవనము ను రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, భద్రాచలం శాసనసభ్యులు డా. తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ శబరిష్ , ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా లతో కలిసి ప్రారంభించినారు.

అనంతరం కొంగాల గ్రామంలో 57 మందికి , నాగారం గ్రామంలో 64 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మంత్రి అందచేశారు.అనంతరం వెంకటాపురం మండలం కేంద్రం లో 60 లక్షల నిధులతో ఉపకార్య నిర్వాహక ఇంజనీర్ (పి.ఆర్) కార్యాలయ భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాప‌న చేశారు. పాత్రపురం గ్రామంలోని రైతు వైదిక లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మంత్రి అందచేశారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రంలో 8 లక్షల 19 వేల కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రజలపై పెను భారం మోపిందని, ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గత పాలకులు చేసిన అప్పులు తీర్చడంతో పాటు సంక్షేమ ఫలాలను అమలు చేస్తున్నాన్నారు. ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి 5 లక్షల రూపాయలతో ఇండ్లను నిర్మించుకోవడానికి అవకాశం కల్పించిందని, వాజేడు, వెంకటాపూరం మండలాలలో నిరుపేదలు ఇండ్లు నిర్మించుకోవడానికి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపనలు చేయడం జరుగుతుందని తెలిపారు. గత ఎన్నికలకు ముందు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు నూతన హామీలను అమలు చేయడానికి కార్యక్రమాలను చేపట్టిన ఈ సంవత్సరం ఉగాది నుండి ధనికుడు తినే సన్నబియ్యాన్ని పేదలకు అందించాలని లక్ష్యంతో ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందజేస్తున్నామని అన్నారు. గతంలో పాలించిన దొర కాలంలో అరకొరగా ఉద్యోగ అవకాశాలు కల్పించగా నేటి ప్రజా ప్రభుత్వం పది నెలల కాలంలోనే 57 వేల 662 ఉద్యోగ అవకాశాలు కల్పించిందని, రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం భూ భారతి చట్టం తెచ్చి పేద రైతులకు చుట్టంగా మార్చిందని అన్నారు.

రాష్ట్రంలోని నిరుద్యోగులకు భరోసా కల్పించాలని ఉద్దేశంతో రాజీవ్ వికాస్ పథకం కింద ఆర్థిక సహాయం చేయాలని లక్ష్యంతో అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, అర్హులైన వారందరికీ జూన్ 2వ తేదీన ఆరువేల కోట్ల రూపాయలను అందజేయడం జరుగుతుందన్నారు. నిరుపేద విద్యార్థినీ, విద్యార్థులకు నూతన పరిజ్ఞానంతో విద్యను బోధించడానికి చర్యలు తీసుకోవడంతో పాటు నిరుపేదలు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్య సేవలు పొందడానికి పది లక్షల రూపాయలను పెంచడం జరిగిందన్నారు. పేదవారి ఆశయాన్ని నెరవేర్చడం కోసం రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతుందని, రానున్న రోజులలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన‌ అనంతరం నూతన పథకాలను అమలు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. అనంత‌రం ఎమ్మెల్యే తెల్లం వెంక‌ట్రావు మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలోని గ్రామాల నిరుపేద ప్రజలకు అదనంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. తన నియోజకవర్గం పరిధిలోని వాజేడు, వెంకటాపురం మండలాలలోని అన్ని గ్రామాలలో అన్ని వర్గాల నిరుపేద ప్రజలు ఉన్నారని వారందరికీ దశలవారీగా ఇండ్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. పేదవారి సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులైన నిరుపేదల అందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తాను ఎన్నికల ముందు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేస్తానని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ములుగు జిల్లా కలెక్ట‌ర్ దివాక‌ర టి.ఏస్‌, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, జిల్లా ఏస్పీ శ‌భ‌రీష్‌, ఏటూరునాగార ఏఏస్పీ శివం ఉపాద్యాయ‌, సంబందిత శాఖల అధికారులు, గ్రామ‌స్తులు త‌దిత‌రులు పాల్గోన్నారు.




Next Story