గుడుంబా నిర్మూలనకు యూత్ సహకరించాలి

by Yella Dhawani Reddy |

గుడుంబా నిర్మూలనకు యూత్ సహకరించాలి
X

దిశ, పలిమెల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో సర్వాయిపేట గ్రామంలో గుడుంబా స్థావరాలపై ఎస్ఐ కె.అరుణ్ సోమవారం దాడులు నిర్వహించారు. దాడుల్లో 20 డ్రమ్ముల బెల్లం పానకం, 20 లీటర్ల గుడుంబాను ధ్వంసం చేసి, ఐదు బస్తాల బెల్లం పటికి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ.. నాటుసారా తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని, ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో గుడుంబా నిర్మూలనకు యువత సహకరించాలని, అనుమానిత వ్యక్తులు ఎవరైనా వస్తే సమాచారం అందించాలని కోరారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story