రైతుల ఇబ్బందులపై పోచంప‌ల్లి శ్రీనివాస్ పోస్ట్ వైర‌ల్

by Ratna Kumari |   (  Updated:2026-03-04 11:45:12  IST  )

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని జాఫర్‌గడ్ మండలంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పోచంపల్లి శ్రీనివాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

రైతుల ఇబ్బందులపై  పోచంప‌ల్లి శ్రీనివాస్ పోస్ట్ వైర‌ల్
X

దిశ, జనగామ : కరెంట్ సరఫరా సక్రమంగా లేక సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని జాఫర్‌గడ్ మండలంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పోచంపల్లి శ్రీనివాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పులు చేసి ఆశలతో వేసిన పంటలు కళ్ల ముందే వాడిపోతుండటంతో గ్రామాల్లో ఆందోళన నెలకొంది. రాత్రివేళల్లో కూడా తగినంత విద్యుత్ అందడం లేదని, బోర్లు పని చేయక పొలాల్లో మొక్కలు ఎండిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. రైతుల పరిస్థితిని వివరించే వీడియోను పోచంపల్లి శ్రీనివాస్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది. పంటలు ఎండిపోతున్న దృశ్యాలు చూసి పలువురు రైతులు తమ సమస్యలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కరెంట్ సరఫరా సక్రమంగా అందించడంతో పాటు నష్టపోయిన రైతులకు తగిన సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

https://twitter.com/PSReddyTRS/status/2029026834151817343

Next Story