- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెక్కొండలో కరెంటోళ్ల సిత్రాలు..!
మండలంలోని విద్యుత్ అధికారుల లీలలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.

X
దిశ, నెక్కొండ: మండలంలోని విద్యుత్ అధికారుల లీలలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇటీవల వ్యవసాయ మార్కెట్ వద్ద మర్రిచెట్టు కొమ్మకే కాసారాలు పెట్టి మెయిన్ లైన్ వేసిన సంగతి మండల ప్రజలకు విదితమే. ఆ ఘటన మరువక ముందే రైల్వే స్టేషన్ కు వెళ్లే మార్గంలో మసీదు ఎదురుగా ఒక వైపు ఒరిగిన కరెంట్ పోల్ కు సపోర్ట్ వైర్ వేయడం మరిచిపోయారు.
సపోర్ట్ తీగ స్థానంలో తాడుతో పక్కనే ఉన్న చెట్టుకు కట్టడంతో దారినపోయే ప్రజలు సంబంధిత అధికారుల పనితనానికి నివ్వెర పోతున్నారు. వరుసగా బయటపడుతున్న నెక్కొండ మండల ఎన్ పీడీసీఎల్ అధికారుల భాగోతానికి ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటారో..? ఎప్పటిలాగే ఉదాసీనంగా ఉంటారో వేచి చూడాలి మరి.
Next Story






