ప్రభుత్వ అసుపత్రిలో అడ్మిట్.. సొంత ఫ్యాన్ తెచ్చుకోవాల్సిందే..

by Bhanu |

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కొరకు అడ్మిట్అవ్వాలనుకున్నవారు.

ప్రభుత్వ అసుపత్రిలో అడ్మిట్.. సొంత ఫ్యాన్ తెచ్చుకోవాల్సిందే..
X

దిశ, మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కొరకు అడ్మిట్అవ్వాలనుకున్నవారు. దయచేసి మీ వెంట ఫ్యాన్ తీసుకువెళ్లండి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఫ్యాన్లు నిదానంగా తిరుగుతుండడంతో , ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్యాన్లు ఉన్నను డమ్మీ ఫ్యాన్లుగా ఆసుపత్రికి వైద్యం నిమిత్తం వచ్చిన ప్రజలు (పేషెంట్స్) ఇంటి వద్ద నుండి ఫ్యాన్లు తీసుకుని వచ్చి ఎవరి బెడ్డు వద్ద వారు సొంతంగా ఫ్యాన్ ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది..ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం నిమిత్తం వెళ్లాలనుకుంటే దోమల బెడద తోపాటు, ఎండాకాలం సరిపడ గాలి కూడా అందడం లేదు.. వైద్యం కొరకు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి సంతానం ఆసుపత్రి నందు ప్రసవించి సరైన వసతులు లేకుండా ఇబ్బందులకు సామాన్య ప్రజలు గురవుతున్నారు. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ వైద్యులు గమనించి సామాన్య ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉండేటట్టు చూడాలి.



Next Story