కదులుతున్న రైలు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు

by velandi.Saikiran |

కదులుతున్న రైలు నుంచి జారిపడి, ఓ ప్ర‌యాణికుడికి తీవ్ర గాయాల పాలైన ఘటన డోర్నకల్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది.

కదులుతున్న రైలు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు
X

దిశ, డోర్నకల్: కదులుతున్న రైలు నుంచి జారిపడి, ఓ ప్ర‌యాణికుడికి తీవ్ర గాయాల పాలైన ఘటన డోర్నకల్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. సిబ్బంది కథనం ప్రకారం.. వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ట్రైన్‌ నుంచి తానంచర్లకు చెందిన తాటి లింగయ్య (70), డోర్నకల్ రైల్వే స్టేషన్ మూడో నెంబర్ ప్లాట్ ఫారంపై జారీ ప‌డ్డాడు. ఈ త‌రుణంలోనే లింగ‌య్య‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆర్పిఎఫ్, జిఆర్పి సిబ్బంది కె.రాజు, ఇమ్రాన్ గమనించి 108కు సమాచారం అందించారు. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి లింగ‌య్య‌ను తరలించారు.

Next Story