- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ కార్యాలయంలో తలకిందులుగా ఎగిరిన పార్టీ జెండా..!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జనగామలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో అపశృతి చోటు చేసుకుంది.

దిశ, జనగామ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జనగామలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో అపశృతి చోటు చేసుకుంది. వేడుకల్లో భాగంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన సమయంలో అది తలకిందులుగా ఎగురుతుండటంతో అక్కడున్న నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యానికి గురయ్యారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. జెండా తలకిందులుగా ఎగురుతున్న విషయాన్ని గుర్తించిన పార్టీ శ్రేణులు వెంటనే నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లగా.. కొద్దిసేపటికే జెండాను సరిచేశారు. అప్పటికే ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఇలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోవడం పై పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. జెండా ఆవిష్కరణ సమయంలో బాధ్యులు మరింత అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నిర్వాహకులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించినట్లు తెలిసింది.






