- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మే 07న స్టేషన్ ఘనపూర్ లో రూ.65 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
జిల్లాలోని నక్కలగుట్ట విద్యుత్ భవన్‌లో ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డిని కలిసి ఈ నెల 7న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

దిశ, హన్మకొండ టౌన్ : జిల్లాలోని నక్కలగుట్ట విద్యుత్ భవన్‌లో ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డిని కలిసి ఈ నెల 7న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీచర 132 కేవీ సబ్ స్టేషన్‌తో పాటు కొండాపూర్, సాగరం, కుర్చపల్లి ప్రాంతాల్లోని 33/11 కేవీ సబ్ స్టేషన్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే జఫర్ గఢ్ 132 కేవీ సబ్ స్టేషన్‌తో పాటు నష్కల్, పల్లగుట్ట, లింగంపల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్లకు శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) వి. మోహన్ రావు, , జనగాం ఎస్.ఈ సంపత్ రెడ్డి, హన్మకొండ ఎస్ ఈ మధుసూదన్ రావు , ట్రాన్స్ కో వరంగల్ ఎస్ఈ నారాయణ రెడ్డి, జనగాం ఎస్ఈ రాజశేఖర్, డివిజనల్ ఇంజినీర్లు లక్ష్మీనారాయణ రెడ్డి, సారయ్య, విజయేందర్ రెడ్డి, విజయ్ కుమార్ పాల్గొన్నారు.






