- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > వరంగల్ > మహా జాతరలో అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలి: అడిషనల్ డైరెక్టర్ జగన్
మహా జాతరలో అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలి: అడిషనల్ డైరెక్టర్ జగన్
by Malleboina Mahesh |
మేడారం మహా జాతరలో సమాచార శాఖ అధికారులు జాతరలో జరుగుతున్న విశేషాలను ఎప్పటికప్పుడు అందించాలని సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ జగన్ ఆదేశించారు.

X
దిశ, మేడారం: మేడారం మహా జాతరలో సమాచార శాఖ అధికారులు జాతరలో జరుగుతున్న విశేషాలను ఎప్పటికప్పుడు అందించాలని సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ జగన్ ఆదేశించారు. అలాగే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ రోజు మహా జాతర ప్రారంభం అయిన సందర్భంగా మేడారంలోని మీడియా సెంటర్లో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మేడారం పరిసర ప్రాంతాల్లో కేటాయించిన వారు విధులను సక్రమంగా నిర్వహించాలని సూచిస్తూ మీడియా మేనేజ్మెంట్, కవరేజ్ తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ వై వెంకటేశ్వర్లు, వెంకట సురేష్, సమాచార శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారి భూపాల్, కొండయ్య, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారులు పాల్గొన్నారు.
- Tags
- medaram
Next Story






