గురుకులం ఘటనపై అధికారులు సీరియస్

by Ratna Kumari |

గురుకులంలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవ విషయంపై ఉన్నతాధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. పర్మినెంట్ ఉద్యోగి జే. లక్ష్మణ్ కు షోకాస్ నోటీసు జారీ చేసినట్లు ఆర్సిఓ తెలిపారు.

గురుకులం ఘటనపై అధికారులు సీరియస్
X

దిశ, మరిపెడ : గురుకులంలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవ విషయంపై ఉన్నతాధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. బుధవారం ఆర్సిఓ పి. రత్నకుమారి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. ఆదివారం రాత్రి జరిగిన గొడవ సమయంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇంటర్ కళాశాల నైట్ షిఫ్ట్ ఇన్ చార్జి బి వీరన్న(బోటనీ), గురుకుల పాఠశాలకు చెందిన నైట్ షిఫ్ట్ ఇన్ చార్జి బి. రాంజేదర్(హిందీ), హౌస్ మాస్టర్, పీటీ, జి ఉపేందర్లను సర్వీస్ రిమూవల్ చేయగా, పర్మినెంట్ ఉద్యోగి జే. లక్ష్మణ్ కు షోకాస్ నోటీసు జారీ చేసినట్లు ఆర్సిఓ తెలిపారు. అదేవిధంగా గురుకులంలో లాంగ్ స్టాండింగ్ గా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని బదిలీ చేసేలా ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. ప్రిన్సిపాల్ పై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. గతంలోనే ప్రిన్సిపల్ కు రెండు మెమోలు జారీ చేశామని, తాజాగా జరిగిన ఘటనతో శాఖ పరమైన చర్యలు తీసుకునెలా ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామన్నారు. పూర్తి నివేదికను కలెక్టర్ కు, విద్యాశాఖ కమిషనర్ కు అందించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆర్సిఓ రత్నకుమారి స్పష్టం చేశారు.

Next Story