శ్రీదుర్గా ఆగ్రో ఇండస్ట్రీస్ ఆస్తుల జప్తున‌కు నోటీస్

by Ratna Kumari |   (  Updated:2026-03-09 11:58:26  IST  )

మండలంలోని నర్సాపురం బోరు గ్రామంలోని సాగి సూర్యనారాయణ రాజుకు చెందిన శ్రీదుర్గా ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రభుత్వానికి బకాయిలు చెల్లించనందున తెలంగాణ రెవెన్యూ రికవరీ చట్టం, 1864 ప్రకారం.. ఆస్తుల వేలం జప్తుకు నోటీసులు జారీ చేసినట్లు తహసీల్దార్ తోట రవీందర్ తెలిపారు.

శ్రీదుర్గా ఆగ్రో ఇండస్ట్రీస్ ఆస్తుల జప్తున‌కు నోటీస్
X

దిశ, మంగపేట : మండలంలోని నర్సాపురం బోరు గ్రామంలోని సాగి సూర్యనారాయణ రాజుకు చెందిన శ్రీదుర్గా ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రభుత్వానికి బకాయిలు చెల్లించనందున తెలంగాణ రెవెన్యూ రికవరీ చట్టం, 1864 ప్రకారం.. ఆస్తుల వేలం జప్తుకు నోటీసులు జారీ చేసినట్లు తహసీల్దార్ తోట రవీందర్ తెలిపారు. తెలంగాణ రెవెన్యూ రికవరీ చట్టం, 1864 (Act II of 1864) ప్రకారం ఫారం-7 (Notice of Sale of Properties) జారీ చేయబడిన నేపథ్యంలో ప్రజల సాధారణ సమాచారం కొరకు ఈ ప్రకటన విడుదల చేసినట్లు తెలిపారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని నర్సాపురం బోరు గ్రామానికి చెందిన ఎం/ఎస్ దుర్గా ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన‌ బకాయిలు చెల్లించనందున సంబంధిత చట్టంలోని నిబంధనల ప్రకారం ముందస్తు నోటీసులు జారీ చేసినప్పటికీ నిర్ణీత గడువులో బకాయిలు చెల్లించనందున సంబంధిత ఆస్తులను జప్తు చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ రెవెన్యూ రికవరీ చట్టం, 1864 లోని సెక్షన్ 36 ప్రకారం ఫారం-7 ద్వారా ఆస్తుల విక్రయ ప్రకటన జారీ చేయబడినది. అందువల్ల కింద వివరణలో పేర్కొన్న ఆస్తులను ప్రభుత్వ బకాయిల వసూళ్ల నిమిత్తం బహిరంగ వేలం (బహిరంగ వేలం) ద్వారా విక్రయించబడును. సంబంధిత ఆస్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి: ములుగు జిల్లా మంగపేట మండలం, లోని సాగి సూర్యనారాయణ రాజు పరిధిలో ఉన్న సర్వే నంబర్లు 216, 217, 218లో విస్తరించిన సుమారు ఎకరాలు 3.08 గుంటల భూమి, ఇందులో రైస్ మిల్ భవనాలు, అనుబంధ నిర్మాణాలు కలిగిన స్థలం అదేవిధంగా పై బకాయిలను వేలం తేదీ 10.04.2026 కి ముందు రోజు సాయంత్రం 5.00 గంటలకు తహసీల్దార్ కార్యాలయం వరకు సంబంధిత బకాయిదారుడు లేదా ఆస్తి కలిగిన ఎవరైనా వ్యక్తి నగదు రూపంలో చెల్లించిన పక్షంలో ఆస్తి వేలం ప్రక్రియను నిలిపివేయబడును. వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వ్యక్తులు నిర్ణీత తేదీ 10.04.2026 శనివారం ఉదయం 10.30 గం. నుంచి మధ్యాహ్నం 12.30 గం. వరకు తహశీల్దార్ కార్యాలయం మంగపేట ప్రాంగణంలో షెడ్యూల్డ్ నిబంధనల ప్రకారం నిర్వహించబడే బహిరంగ వేలంలో పాల్గొనవచ్చును. వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు తహశీల్దార్ కార్యాలయం, మంగపేట వద్ద అందుబాటులో ఉంటాయి. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా తహసీల్దార్ తోట రవీందర్ విజ్ఞప్తి చేశారు.

Next Story