- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవోతో సంబంధం లేదు.. కో ఆప్షన్ సభ్యుడిని నేనే..!
జీవోతో తనకు సంబంధం లేదు.. తానే కో ఆప్షన్ సభ్యుడిని అంటూ సర్పంచ్ అర్పిత భర్త దిలీప్ రెడ్డి సోషల్ మీడియా ప్రచారం చేసుకోవడం సంచలనంగా మారింది.

X
దిశ, గీసుకొండ : జీవోతో తనకు ఎలాంటి సంబంధం లేదు.. తాను కో ఆప్షన్ సభ్యుడిని అని మరియాపురం సర్పంచ్ అర్పిత భర్త దిలీప్ రెడ్డి సోషల్ మీడియాలో ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామంలో జరిగే అబివృద్ధి పనుల్లో తానే ప్రత్యక్షంగా పాల్గొంటూ .. తానే కో ఆప్షన్ సభ్యుడినీ అంటూ గ్రామ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. సర్పంచ్ కి బదులు భర్త పెత్తనం ఏంటి..? అని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మండలంలో కూడా కొంత మంది ఆశావాహులు మాకు ఇవ్వకుండా అతని ఒక్కనికి ఎలా ఇచ్చారు అని అయోమయంలో ఉన్నారు. "కో ఆప్షన్ సభ్యుల నియామక జీవో రాలేదు. జీవో వస్తేనే మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరూ నియమించ పడలేదు. మాకు ఎలాంటి సంబంధం లేదు" అని ఎంపీఓ పాక శ్రీనివాస్ తెలిపారు.
Next Story






